BSNL Rs 997 Prepaid Plan : BSNLలో మ‌రో అద్భుత‌మైన ప్లాన్‌.. 160 రోజుల వాలిడిటీతో..!

January 15, 2026 9:13 PM

BSNL Rs 997 Prepaid Plan : ప్రైవేటు టెలికాం సంస్థ‌లైన రిల‌య‌న్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ లు మొబైల్ చార్జిల‌ను విప‌రీతంగా పెంచ‌డంతో సామాన్య ప్ర‌జ‌లు చాలా మంది ఇప్ప‌టికే BSNLలోకి మారిపోయారు. ఇంకా ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతూనే ఉంది. చాలా చోట్ల BSNL సిమ్‌ల కోసం ప్ర‌జ‌లు క్యూలు క‌డుతున్నారు. ఇక త్వ‌ర‌లోనే BSNLలో 4జితోపాటు 5జి కూడా వ‌స్తుంద‌ని చెబుతుండ‌డంతో ఈ సిమ్‌ల‌ను తీసుకునేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తిని చూపిస్తున్నారు. BSNLలో ఇత‌ర కంపెనీల‌తో పోలిస్తే చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే రీచార్జి ప్లాన్లు అందుబాటులో ఉండ‌డం విశేషం.

BSNLలో ప్రీపెయిడ్ వినియోగ‌దారులు రూ.997తో రీచార్జి చేసుకుంటే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 160 రోజులు కాగా ఇదేలాంటి ప్లాన్‌ను ఇత‌ర కంపెనీలు అయితే కేవ‌లం 84 రోజుల వాలిడిటీతోనే అందిస్తున్నాయి. ఇక BSNL అందిస్తున్న రూ.997 ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు 160 రోజుల వాలిడిటీతోపాటు రోజుకు 2జీబీ చొప్పున డేటా ల‌భిస్తుంది. అలాగే 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా వ‌స్తాయి. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవ‌చ్చు.

BSNL Rs 997 Prepaid Plan full details and benefits you will get
BSNL Rs 997 Prepaid Plan

ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌లో ఇదే ప్లాన్ ద్వారా కేవ‌లం 84 రోజుల వాలిడిటీని మాత్ర‌మే పొంద‌వ‌చ్చు. కానీ BSNL ద్వారా మాత్రం దాదాపుగా అంత‌కు రెట్టింపు మొత్తంలో వాలిడిటీ ల‌భిస్తుంది. అందువ‌ల్లే చాలా మంది BSNLకు మారిపోతున్నారు. ఇక ఇప్పుడు చాలా చోట్ల ర‌హ‌దారుల ప‌క్క‌న కూడా స్టాండ్ల‌లో BSNL సిమ్‌ల‌ను విక్ర‌యిస్తుండ‌గా.. అవ‌న్నీ హాట్ కేకుల్లా అమ్ముడ‌వుతున్నాయి. అయితే BSNL సిమ్‌ను మొద‌టిసారి పొందే ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్లు ముందుగా రూ.249 చెల్లించాల్సి ఉంటుంది. కానీ సిమ్ ఫ్రీగా ఇస్తారు. ఈ ప్లాన్ వాలిడిటీ నెల రోజుల వ‌ర‌కు ఉంటుంది. సిమ్ తీసుకున్న వెంట‌నే 4 నుంచి 24 గంట‌ల్లోగా యాక్టివేట్ కూడా అవుతుంది. ఎలాంటి వెరిఫికేష‌న్ కాల్ కూడా చేయాల్సిన ప‌నిలేదు. ఆధార్ బ‌యోమెట్రిక్‌తో సిమ్ పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories