స్మార్ట్ టీవీల‌పై అమెజాన్‌లో భారీ త‌గ్గింపు ధ‌ర‌లు.. 63 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌..!

April 6, 2021 12:41 PM

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న సైట్‌లో స్మార్ట్ టీవీల‌ను కొనుగోలు చేసే వారికి అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. స్మార్ట్ టీవీల‌ను కొనాల‌ని చూస్తున్న వారు అమెజాన్‌లో వాటిని కొనుగోలు చేసి పెద్ద ఎత్తున డ‌బ్బును ఆదా చేయ‌వ‌చ్చు. ఏకంగా 63 శాతం వ‌ర‌కు టీవీలపై డిస్కౌంట్ల‌ను అందిస్తున్నారు.

amazon offers huge discounts on smart tvs

టీసీఎల్ కంపెనీకి చెందిన ఓ స్మార్ట్ టీవీపై ఏకంగా రూ.57,691 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఆ టీవీని రూ.52,299 ధ‌ర‌కు వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. దీంతోపాటు రూ.1000 విలువైన గిఫ్ట్ కూప‌న్ ల‌భిస్తుంది.

అలాగే అమెజాన్ బేసిక్స్ టీవీల‌పై 42 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. స్మార్ట్ టీవీల‌ను రూ.21,001 త‌గ్గింపుతో రూ.28,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. 32 ఇంచుల స్కైవాల్ కంపెనీ టీవీ ధ‌ర రూ.25,499 ఉండ‌గా దాన్ని రూ.12,499కే అందిస్తున్నారు. రూ.13వేల డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

ఫిలిప్స్ స్మార్ట్ టీవీల‌పై 63 శాతం డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. హై ఎండ్ మోడ‌ల్ టీవీ ధర రూ.1,05,990 ఉండ‌గా దాన్ని రూ.38,990కే కొన‌వ‌చ్చు. రూ.66,991 భారీ డిస్కౌంట్ ల‌భిస్తుంది. అలాగే టీసీఎల్‌కు చెందిన 65 ఇంచుల స్మార్ట్ టీవీ ధ‌ర రూ.1,89,990 ఉండగా దీనిపై రూ.1,00,500 రాయితీ ల‌భిస్తుంది. దీంతో టీవీని రూ.89,940కి కొన‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now