టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కొత్తగా రూ.456కు ఓ ప్రీపెయిడ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. జియో ఇటీవలే ఎలాంటి రోజువారీ లిమిట్ లేకుండానే కొత్త ప్లాన్లను లాంచ్ చేసిన విషయం విదితమే. అందుకు పోటీగా ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో లభించనున్న సదుపాయాలు ఇలా ఉన్నాయి.
రూ.456 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే 50 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. దీనికి రోజు వారీ లిమిట్ లేదు. ఈ ప్యాక్ వాలిడిటీని 60 రోజులుగా నిర్ణయించారు. కనుక అప్పటిలోగా డేటాను ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇక ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఉచిత ట్రయల్ లభిస్తుంది. అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్ ఉచిత సేవలను పొందవచ్చు. ఫాస్టాగ్‌పై క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఈ ప్యాక్‌ను ఎయిర్‌టెల్ వెబ్‌సైట్, యాప్, ఇతర విధానాల్లో రీచార్జి చేసుకుని ఉపయోగించవచ్చు. కాగా జియోలో రూ.447 ప్లాన్‌లో 50జీబీ డేటా లభిస్తుంది. దీనికి 60 రోజుల వాలిడిటీ ఉంటుంది. రోజువారీ డేటా లిమిట్ లేదు. ఎప్పుడైనా ఎంత డేటాను అయినా వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…