భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి, ఆయన సతీమణి, నటి అనుష్క శర్మ బృందావన్‌లోని ఆశ్రమాన్ని సందర్శించి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. బృందావన్ ఆశ్రమంలో ఇతర భక్తులతో కలిసి కూర్చున్న కోహ్లి దంపతులకు ప్రేమానంద్ జీ మహారాజ్ భక్తి, ఆత్మసమర్పణ ప్రాముఖ్యతపై సందేశం ఇచ్చారు. కష్టకాలమే నిజమైన భక్తుల విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. చాలామంది భౌతిక కోరికలు నెరవేరాలని దేవుడికి శరణాగతి చేస్తారు. కానీ దేవుడి ప్రేమను కోరుకోవడమే అసలైన శరణాగతి.. అని ఆయన ఉపదేశించారు.
మంగళవారం (ఫిబ్రవరి 17, 2026) ఉదయం ఆశ్రమానికి చేరుకున్న విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దాదాపు గంటకు పైగా అక్కడే గడిపారు. ఆధ్యాత్మిక చర్చలు, ధ్యానం మధ్య ప్రశాంత వాతావరణంలో వారు గడిపినట్లు ఆశ్రమ వర్గాలు తెలిపాయి. తమ కుమారుడు అకాయ్ రెండవ పుట్టినరోజు (ఫిబ్రవరి 15) జరిగిన రెండు రోజులకే ఈ జంట బృందావనం చేరుకోవడం విశేషం.
ఇది కోహ్లి దంపతుల తొలి ఆశ్రమ సందర్శన కాదు. గతేడాది మే 13, 2025న, విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన మరుసటి రోజే వారు ఇదే ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ సమయంలో కూడా ప్రేమానంద్ జీ మహారాజ్ ఇచ్చిన ఉపదేశాలను శ్రద్ధగా విన్నారు.
అప్పుడు ఆయన ఇచ్చిన సందేశంలో అంతర్ముఖ ఆలోచన, భక్తితో దేవుని నామస్మరణ చేయడం ద్వారా అంతర్గత శాంతి, ఆధ్యాత్మిక విముక్తి లభిస్తుందని వివరించినట్లు ఆశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కోహ్లి దంపతుల ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవలే రిలీజ్ చేసిన విషయం…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళనాడు వాసి అయినప్పటికీ పలు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ఆమె…
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌కు టాలీవుడ్‌లో తొలి మూవీలోనే చేదు అనుభవం ఎదురైంది.ఆమె నటించిన రాజాసాబ్ మూవీ అట్టర్ ఫ్లాప్‌గా…
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి…
హనుమాన్ జయంతి సందర్భంగా తమ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్రహంపై సూర్య కిరణాలు పడడం తన…
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…