క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

భార‌త మాజీ బ్యాట్స్‌మ‌న్ స‌చిన్ టెండుల్క‌ర్ క‌రోనా బారిన ప‌డ్డాడు. ఈ మేరకు సచిన్ ఈ విష‌యాన్ని స్వయంగా వెల్ల‌డించాడు. ట్విట్ట‌ర్ ద్వారా స‌చిన్ ఈ విష‌యాన్ని తెలియ‌జేశాడు. తన‌కు కోవిడ్ 19 స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని, దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై ప‌రీక్ష చేయించుకున్నాన‌ని, అందులో కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలిపాడు.

కాగా తాను ఇంట్లో క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాన‌ని స‌చిన్ తెలిపాడు. అయితే కుటుంబ స‌భ్యులు కూడా కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకున్నారని, కానీ కోవిడ్ నెగెటివ్ వ‌చ్చింద‌న్నాడు. అయిన‌ప్ప‌టికీ త‌న చుట్టూ తిరిగిన వారు, ఉన్న‌వారు క్వారంటైన్‌లోకి వెళ్లాల‌ని, ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించాడు. ఇక త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న ఫ్యాన్స్ తోపాటు వైద్యం అందిస్తున్న డాక్ట‌ర్ల‌కు స‌చిన్ కృతజ్ఞ‌త‌లు తెలిపాడు.

కాగా స‌చిన్ భార‌త క్రికెట్ జ‌ట్టుకు 1989 నుంచి 2013 వ‌ర‌కు ఆడాడు. మొత్తం 200 టెస్టులు ఆడిన ఏకైక క్రికెట‌ర్ స‌చిన్ కావ‌డం విశేషం. అలాగే వ‌న్డేలు, టెస్టుల్లోనూ అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డు కూడా సచిన్ పేరిటే ఉంది. టెస్టుల్లో స‌చిన్ 15,291 ప‌రుగులు చేయ‌గా, 463 వ‌న్డేల్లో 18,426 ప‌రుగులు చేశాడు. ఇటీవ‌ల జ‌రిగిన రోడ్ సేఫ్టీ సిరీస్‌లో స‌చిన్ ఇండియా లెజెండ్స్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించాడు. అందులో భార‌త్ ఫైన‌ల్ లో శ్రీ‌లంక లెజెండ్స్‌పై విజ‌యం సాధించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM