క్రికెట్

2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా? క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ.. హిట్ మ్యాన్ మనసులో ఏముందంటే!

వన్డే వరల్డ్ కప్ గెలవడమే నా అంతిమ లక్ష్యం – రోహిత్ శర్మ. Photo Credit: BCCI.

భారత వన్డే జ‌ట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలనే తన కోరికను స్పష్టంగా వెల్లడించారు. ఈ మెగా టోర్నీ సౌతాఫ్రికాలో జరగనుంది. 50 ఓవర్ల వరల్డ్ కప్ తనకు ఎప్పటి నుంచో అత్యంత ప్రాధాన్యమున్న ట్రోఫీ అని ఆయన పేర్కొన్నారు. ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీట‌ర్స‌న్ తో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్ తాను తప్పకుండా ఆ వరల్డ్ కప్ ఆడాలని అనుకుంటున్నాన‌ని, త‌న‌ దేశం కోసం ఆ ట్రోఫీని గెలవాలనే ఆశ ఎప్పుడూ ఉంద‌ని అన్నారు. చిన్నప్పుడు తాము చూసింది 50 ఓవర్ల వరల్డ్ కప్ మాత్రమే అని, టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ లేవని అన్నారు. నాలుగేళ్లకోసారి జరిగే ఆ టోర్నీనే క్రికెట్‌లో అత్యంత ముఖ్య‌మ‌ని, ఆ ట్రోఫీ కోసం త‌న‌ శక్తి మేరకు కష్టపడతాన‌ని తెలిపారు.

2023 ఓట‌మి అనంత‌రం నిరాశ‌..

రోహిత్ ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. చివరిసారిగా ఆయన ఇటీవ‌ల‌ న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ తరఫున ఆడారు. ఆ సిరీస్‌ను న్యూజిలాండ్ 2-1తో గెలుచుకుంది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ నాయకత్వంలో భారత్ లీగ్ దశలో అజేయంగా నిలిచింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఆ నిరాశ తరువాత భారత్ ఐసీసీ టోర్నీల్లో విజయాలు సాధించింది. 2024లో టీ20 వరల్డ్ కప్‌ను సౌతాఫ్రికాపై ఫైనల్లో గెలుచుకుంది. ఆ తరువాత దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ సొంతం చేసుకుంది.

రోహిత్ కెప్టెన్సీ తరువాత వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను బీసీసీఐ నియమించింది. ఆస్ట్రేలియా సిరీస్ నుంచే గిల్ బాధ్యతలు చేపట్టాడు. అయితే కెప్టెన్సీ మారినా 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆటగాడిగా ట్రోఫీ గెలవాలనే పట్టుదల రోహిత్ శర్మలో స్పష్టంగా కనిపిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రి ఆయ‌న అప్ప‌టి వ‌ర‌కు ఫామ్ లో ఉంటాడా, అది జ‌రిగినా ఆయ‌న అప్ప‌టికి వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకుంటాడా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM