వినోదం

విజయ్ ‘జన నాయకుడు’ రిలీజ్ చిక్కులు వీడాయి.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే!

విజయ్ చివరి చిత్రంగా వస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘జన నాయకుడు’. Photo Credit: Jana Nayakudu Team.

తమిళ న‌టుడు విజ‌య్ నటించిన జ‌న నాయ‌గ‌న్ చిత్రం థియేట్రికల్ రిలీజ్‌కు మళ్లీ సిద్ధమవుతోంది. రాజకీయాల్లో పూర్తిస్థాయి ప్రవేశానికి ముందు ఇది ఆయన చివరి సినిమా కావచ్చని భావిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో జ‌న నాయ‌కుడు పేరుతో విడుదల కానుంది. మొదట జనవరి 9, 2026న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినా సెన్సార్ అభ్యంతరాలు, న్యాయపరమైన సమస్యల వల్ల విడుద‌ల‌ నిలిచిపోయింది. కొన్ని హింసాత్మక సన్నివేశాలు, రాజకీయ సూచనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ మద్రాస్ హైకోర్టులో సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం స‌ర్టిఫికేష‌న్ (CBFC)పై దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఇకపై సినిమా రివిజన్ కమిటీ పరిశీలనకు వెళ్ల‌నుంది. సర్టిఫికేషన్‌పై తుది నిర్ణయం ఒక వారంలో వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో వారం త‌రువాత సినిమా రిలీజ్ అవ‌నుంద‌ని తెలుస్తోంది.

ఫిబ్ర‌వ‌రి 19న విడుద‌ల‌..?

కాగా రాజకీయ యాక్షన్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన జ‌న‌నాయ‌గ‌న్ సినిమాకు హెచ్‌.వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డె, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించారు. ఇక రివిజన్ కమిటీ నుంచి అనుమతి లభిస్తే, ఫిబ్రవరి 19వ తేదీన సినిమా విడుదలయ్యే అవకాశమున్న‌ట్లు తెలుస్తోంది. అన్ని ప్రక్రియలు సమయానికి పూర్తైతే విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంద‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM