ఐపీఎల్

ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు, ఫుడ్ డెలివ‌రీ యాప్‌ల‌కు మేలు చేయ‌నున్న ఐపీఎల్‌.. ఎలాగంటే..?

క‌రోనా వ‌ల్ల గతేడాది చాలా ఆల‌స్యంగా ఐపీఎల్ జరిగిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం మాత్రం షెడ్యూల్ ప్ర‌కార‌మే ఐపీఎల్ ప్రారంభ‌మైంది. ఐపీఎల్ 14వ ఎడిష‌న్ ఈ నెల 9వ తేదీన ప్రారంభం అయింది. వేస‌విలో క్రికెట్ అభిమానుల‌కు ఎప్ప‌టిలా ఐపీఎల్ వినోదాన్ని అందించ‌నుంది. అయితే ఐపీఎల్ వ‌ల్ల ఈ సారి ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు, ఫుడ్ డెలివ‌రీ యాప్‌ల‌కు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంద‌ని, వారి వ్యాపారాలు జోరుగా కొన‌సాగుతాయ‌ని ప‌లువురు వ్యాపార‌వేత్త‌లు, విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

లాక్‌డౌన్ స‌మయంలో చాలా మంది సోష‌ల్ మీడియా, టీవీల‌కు అతుక్కుపోయారు. స్మార్ట్ ఫోన్ ప్ర‌పంచంలో విహ‌రించారు. ప్ర‌స్తుతం స‌రిగ్గా అలాంటి ప‌రిస్థితులే ఉన్నాయి. అనేక చోట్ల పాక్షిక లాక్‌డౌన్‌లు, క‌ర్ఫ్యూలు కొన‌సాగుతున్నాయి. దీంతో ప్ర‌జ‌లు చాలా వ‌ర‌కు ఇళ్ల‌కే ప‌రిమితం అవుతున్నారు. గ‌త ఏడాది లాక్‌డౌన్ స‌మ‌యంలో ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు మూడు పువ్వులు, ఆరు కాయ‌లుగా వ్యాపారం కొన‌సాగించాయి. క‌నుక ఇప్పుడు కూడా అలాగే వాటి వ్యాపారం కొన‌సాగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక ఐపీఎల్‌ను ఈసారి చాలా మంది టీవీల్లోనే వీక్షిస్తారు క‌నుక ఆ మ్యాచ్‌ల‌లో యాడ్స్ ను ఇవ్వ‌డం ద్వారా ఎక్కువ మంది వినియోగ‌దారులను ఆకర్షించాల‌ని, త‌ద్వారా బిజినెస్ ఎక్కువ‌గా చేయాల‌ని ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అందువ‌ల్ల ఐపీఎల్ ఈసారి ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌కు స‌హాయం చేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక క‌రోనా వ‌ల్ల అనేక చోట్ల నిబంధ‌న‌ల‌ను విధించారు. బార్లు, రెస్టారెంట్ల‌ను మూసి వేశారు. ఐపీఎల్ ఉన్న రోజుల్లో ప్రేక్ష‌కులు వాటికి వెళ్లి మ్యాచ్‌ల‌ను వీక్షిస్తూ మ‌ద్యం, ఫుడ్ తీసుకుంటూ ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడ‌వి లేవు. దీంతో ఇళ్ల‌లో లేదా బంధువులు, స్నేహితులతో క‌ల‌సి ఒక్క చోట కూర్చుని మ్యాచ్‌లను ఎంజాయ్ చేసేందుకు ఎక్కువ‌గా అవ‌కాశం ఉంది. క‌నుక వారు స‌హ‌జంగానే ఫుడ్ కోసం ఫుడ్ డెలివ‌రీ యాప్‌ల‌పై ఆధార ప‌డ‌తారు. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్ ఈ వ్యాపారానికి కూడా మేలు చేయ‌నుంది. మరి ఈసారి ఐపీఎల్ వ‌ల్ల ఆయా రంగాలు ఎంత‌గా లాభ ప‌డ‌తాయో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM