IPL 2021 : మిస్ట‌ర్ కూల్ ధోనీ.. ఆగ్ర‌హించిన వేళ‌.. క్యాచ్ మిస్ అవ‌డంతో ఫైర్‌.. వైర‌ల్ వీడియో..!

September 20, 2021 4:34 PM

IPL 2021 : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఎంత కామ్‌గా, కూల్‌గా ఉంటాడో అంద‌రికీ తెలిసిందే. మైదానంలో ఎలాంటి ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నా ధోనీ ఏమాత్రం ప్ర‌భావితం కాడు. త‌న ఆట తాను కొన‌సాగిస్తాడు. అందుక‌నే ధోనీకి మిస్ట‌ర్ కూల్ అని పేరు వ‌చ్చింది. అయితే ఎంతైనా ధోనీ కూడా మ‌నిషే క‌దా. క‌నుక అత‌నికి కూడా ఎప్పుడో ఒక‌సారి ఆగ్ర‌హం వ‌స్తుంటుంది. తాజాగా ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ధోనీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

IPL 2021 : మిస్ట‌ర్ కూల్ ధోనీ.. ఆగ్ర‌హించిన వేళ‌.. క్యాచ్ మిస్ అవ‌డంతో ఫైర్‌.. వైర‌ల్ వీడియో..!

ముంబై ఇండియ‌న్స్ ప్లేయ‌ర్ సౌర‌భ్ తివారీ త‌మ జ‌ట్టును గెలిపించేందుకు జోరు మీదున్నాడు. అయితే అదే స‌మ‌యంలో చెన్నై బౌల‌ర్ దీప‌క్ చాహ‌ర్ వేసిన బంతి తివారీ బ్యాట్ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి పైకి లేచింది. ధోనీ క్యాచ్ తాను ప‌డ‌తానంటూ అరుస్తూ క్యాచ్ ప‌ట్టేందుకు ముందుకు వెళ్లాడు. కానీ క్యాచ్ వ‌చ్చే పొజిష‌న్‌లో అప్ప‌టికే బ్రేవో క్యాచ్ కోసం ఎదురు చూస్తున్న‌ట్లు చేతులు చాపాడు. అయితే ధోనీ దాన్ని గ‌మ‌నించ‌కుండా క్యాచ్ కోసం ముందుకు వ‌చ్చేశాడు. దీంతో బంతి ఇద్ద‌రి మ‌ధ్య‌లో ప‌డింది. ఎవ‌రికీ క్యాచ్ ల‌భించ‌లేదు.

https://twitter.com/im_maqbool/status/1439781140810715141

అయితే ఈ క్యాచ్ వ‌దిలేసినా మ్యాచ్‌పై అది పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేదు. ఎందుకంటే చివ‌ర‌కు ముంబైపై చెన్నై సునాయాసంగానే గెలుపొందింది. అయితే ఆ క్యాచ్ సంద‌ర్భంగా ధోనీ బ్రేవోపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now