ఐపీఎల్ 2021 మ‌ళ్లీ వ‌స్తోంది.. సెప్టెంబ‌ర్ 19 నుంచే రెండో షెడ్యూల్‌.. పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోండి..!

July 25, 2021 10:19 PM

ఐపీఎల్ 2021 ఎడిష‌న్ కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే మొద‌టి ద‌శ‌లో 29 మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే మ‌రో 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. దీంతో సెప్టెంబ‌ర్ 19 నుంచి ఆ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తారు. అక్టోబ‌ర్ 15వ తేదీన ఫైన‌ల్ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్‌ల‌న్నింటినీ యూఏఈలోనే నిర్వ‌హిస్తారు. ఈ మేరకు ఆదివారం బీసీసీఐ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

bcci announce ipl 2021 second schedule

సెప్టెంబ‌ర్ 19న చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. అక్టోబ‌ర్ 10, 11, 13 తేదీల్లో క్వాలిఫైర్ 1, ఎలిమినేట‌ర్‌, క్వాలిఫైర్ మ్యాచ్‌లు జ‌రుగుతాయి. అక్టోబ‌ర్ 15న ఫైన‌ల్ జ‌రుగుతుంది. మొత్తం మ్యాచ్‌ల‌లో 13 మ్యాచ్‌లు దుబాయ్‌లో, 10 షార్జాలో, 8 అబుధాబిలో జ‌రుగుతాయి.

కాగా ప్ర‌స్తుత ఐపీఎల్ సీజ‌న్‌లో పాయింట్ల ప‌ట్టిక‌లో ఢిల్లీ, చెన్నై, బెంగ‌ళూరు, ముంబైలు టాప్ 4 స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ షెడ్యూల్‌లో విదేశీ ప్లేయ‌ర్లు చాలా మంది పాల్గొన‌డం లేదు. ఐపీఎల్ రెండో షెడ్యూల్‌కు కొద్ది రోజుల త‌రువాతే ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో చాలా జ‌ట్లు త‌మ ప్లేయ‌ర్ల‌ను ఐపీఎల్‌లో ఆడించేందుకు నిరాక‌రించాయి. దీంతో చాలా మంది విదేశీ ప్లేయ‌ర్లు ఈ షెడ్యూల్‌లో క‌నిపించ‌రు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment