క్రికెట్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ ఊచకోత.. నంబర్ 1గా అభిషేక్ శర్మ!

ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్తున్న భారత బ్యాటర్లు. Photo Credit: ICC.

తాజా ఐసీసీ టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్‌ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటారు. ఇటీవల ఫామ్‌పై ప్రశ్నలు వచ్చినప్పటికీ, భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. అదే సమయంలో వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టాప్ 10లోకి దూసుకొచ్చాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అభిషేక్ శర్మకు ఆరంభం ఆశించిన స్థాయిలో లేకపోయింది. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అనంతరం జీర్ణాశ‌య‌ ఇన్‌ఫెక్షన్ కారణంగా న్యూఢిల్లీలో ఆసుపత్రిలో చేరి నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. తిరిగి పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ మరోసారి డక్‌నే నమోదు చేశాడు. అయితే ఈ ఫామ్ ఇబ్బందుల మధ్యన కూడా అభిషేక్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కోల్పోకపోవడం గమనార్హం.

17 స్థానాలు మెరుగు ప‌రుచుకున్న ఇషాన్ కిష‌న్‌..

ఇషాన్ కిషన్ వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. వరుసగా రెండో అర్ధశతకం సాధించిన ఇషాన్, పాకిస్థాన్‌పై 40 బంతుల్లో 77 పరుగులతో మ్యాచ్ గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు 17 స్థానాలు ఎగబాకి మొత్తం ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక బ్యాటర్ పతుమ్ నిస్సంక ఆస్ట్రేలియాపై అద్భుత శతకం సాధించడంతో 3 స్థానాలు మెరుగుపరుచుకొని మూడో స్థానానికి చేరాడు. సౌతాఫ్రికా ఆటగాళ్లు రయాన్ రికెల్టన్ (22 స్థానాలు ఎగబాకి 11వ స్థానం), ఎయిడెన్ మార్క‌ర‌మ్ (6 స్థానాలు లాభపడి 15వ స్థానం) కూడా టాప్ జాబితాలోకి దూసుకొచ్చారు. అలాగే యూఎస్ఏ ఆటగాడు సాయితేజ ముక్కామ‌ల‌ (21వ స్థానం), ఇంగ్లండ్ యువకుడు జేకబ్ బెథెల్ (32వ స్థానం) కూడా మంచి గెయిన్ సాధించారు.

ఆల్ రౌండ‌ర్ల జాబితాలో..

టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. పాకిస్థాన్ యువ ఆల్‌రౌండర్ సైమ్ అయూబ్ మరోసారి నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. భారత్‌పై 3 వికెట్ల ప్రదర్శనతో అతను జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజాను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. రాజా రెండో స్థానానికి పడిపోయాడు. నేపాల్‌కు చెందిన దిపేంద్ర సింగ్ అయిరీ, అఫ్గానిస్థాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు.

వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి అగ్ర‌స్థానంలోనే..

టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరి వరుణ్‌కు చేరువయ్యాడు. జింబాబ్వే పేసర్ బ్రాడ్ ఎవాన్స్ వరుసగా 3 వికెట్ల ప్రదర్శనలతో 10 స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరాడు. భారత బౌలర్లు అక్షర్ పటేల్ (14వ స్థానం), జస్‌ప్రీత్ బుమ్రా (15వ స్థానం) కూడా ర్యాంకింగ్స్‌లో మెరుగుదల సాధించారు. కాగా తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల ప్రభావం స్పష్టంగా కనిపించగా, టీ20 వరల్డ్‌కప్ ప్రదర్శనలు ర్యాంకింగ్స్‌పై ఎంత ప్రభావం చూపుతున్నాయో మరోసారి రుజువైంది. అయితే రానున్న మ్యాచ్‌ల‌లో అయినా అభిషేక్ ప‌రుగులు చేసి బ్యాట‌ర్ల‌లో త‌న ర్యాంకును నిలుపుకుంటాడా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM

ప్రభాస్ ‘ఫౌజీ’ లీకులకు చెక్.. ఫ్యాన్స్‌కు మేకర్స్ సీరియస్ వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవు..

ఇటీవ‌లి కాలంలో చాలా వ‌ర‌కు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇత‌ర న‌టీన‌టుల‌కు చెందిన ఫొటోలు,…

Sunday, 5 April 2026, 3:18 PM

గ్యారంటీలపై రేవంత్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 6 హామీల‌ను అస‌లు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స‌రే…

Saturday, 4 April 2026, 11:25 PM

సీఎస్కే ఓటములపై సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే కష్టమే!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల‌లోనూ…

Saturday, 4 April 2026, 8:07 PM

అభిషేక్ శర్మకు అన్యాయం.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం అభిషేక్ శ‌ర్మ‌కు కాకుండా ఇషాన్ కిష‌న్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం త‌న‌ను నిరాశ‌కు గురి…

Saturday, 4 April 2026, 4:01 PM

‘రామాయణం’ కోసం ఏఆర్ రెహమాన్ భారీ పారితోషికం.. ఆ ఫిగర్ చూసి ఫ్యాన్స్ షాక్!

పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న రామాయ‌ణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవ‌లే రిలీజ్ చేసిన విష‌యం…

Saturday, 4 April 2026, 12:10 PM

హ్యాపీ బర్త్‌డే నా చిన్ని బాబు.. కుమారుడు అయాన్ పుట్టినరోజున అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…

Saturday, 4 April 2026, 10:26 AM

ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ ‘ఎస్. సరస్వతి’.. ఎక్కడ చూడాలంటే?

న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ త‌మిళ‌నాడు వాసి అయిన‌ప్ప‌టికీ ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ చిత్రాలు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. గ‌తంలో ఆమె…

Friday, 3 April 2026, 9:50 PM