భార‌త్ 5వ టెస్టు మ్యాచ్ ఆడ‌లేద‌ని ఇంగ్లండ్ క్రికెట‌ర్ల ప్ర‌తీకారం.. ఐపీఎల్ నుంచి త‌ప్పుకున్నారు..

September 11, 2021 5:25 PM

మ‌రికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2021 రెండో ద‌శ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఫ్రాంచైజీల‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ప‌లువురు ఇంగ్లండ్ క్రికెట‌ర్లు ఐపీఎల్‌లో ఆడ‌బోవ‌డం లేద‌ని తేల్చి చెప్పారు. ఇటీవ‌ల భార‌త్‌, ఇంగ్లండ్ ల మ‌ధ్య మాంచెస్ట‌ర్‌లో 5వ టెస్టు జ‌ర‌గాల్సి ఉంది. కానీ కోవిడ్ భ‌యంతో భార‌త్ మ్యాచ్ ఆడేందుకు నిరాక‌రించింది. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మ్యాచ్‌ను ర‌ద్దు చేసింది.

భార‌త్ 5వ టెస్టు మ్యాచ్ ఆడ‌లేద‌ని ఇంగ్లండ్ క్రికెట‌ర్ల ప్ర‌తీకారం.. ఐపీఎల్ నుంచి త‌ప్పుకున్నారు..

అయితే 5వ టెస్టు మ్యాచ్‌ను భార‌త ఆడ‌ని కార‌ణంగా ఇంగ్లండ్ క్రికెట‌ర్లు ప్ర‌తీకారం తీర్చుకున్నారు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, పంజాబ్ కింగ్స్ జ‌ట్లకు ఆడుతున్న జానీ బెయిర్ స్టో, క్రిస్ వోక్స్‌, డేవిడ్ మ‌ల‌న్‌లు ఈ ద‌శ ఐపీఎల్‌లో ఆడ‌బోవ‌డం లేద‌ని చెప్పారు. అయితే పంజాబ్ కింగ్స్ మాత్రం వెంట‌నే న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు ప్రారంభించింది. ఎయిడెన్ మార్క‌ర‌మ్‌ను రీప్లేస్‌మెంట్ కింద తీసుకుంది.

అయితే నిజానికి ఈ విష‌యంలో ఇంగ్లండ్ ప్లేయ‌ర్ల‌ను త‌ప్పుప‌ట్టాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే బ‌యో సెక్యూర్ బ‌బుల్‌లో ఉండి కూడా కోవిడ్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా విరాట్ కోహ్లి, కోచ్ ర‌విశాస్త్రిలు వ్య‌వ‌హ‌రించారు. వారు హోట‌ల్‌లో ఉండ‌కుండా బ‌య‌ట ప‌లు కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యారు. దీంతో కోచ్ శాస్త్రితోపాటు మ‌రో ఇద్ద‌రు స‌హాయ‌క కోచ్‌ల‌కు కోవిడ్ సోకింది. అయితే 5వ టెస్టుకు ముందు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా అంద‌రికీ కోవిడ్ నెగెటివ్ వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ మ్యాచ్‌ను ఆడేందుకు కోహ్లి అండ్ కో నిరాక‌రించారు. దీంతో 5వ టెస్టు క్యాన్సిల్ అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now