సాధారణంగా క్రికెట్ లేదా ఏదైనా ఆటలు ఆడుతున్న సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడం సర్వసాధారణమే, ఇలాంటి ఘర్షణ మనం తరచూ చూస్తూ ఉంటాము. కానీ ఇంగ్లండ్‌లో కొందరు యువకులు పేదలకోసం చారిటీ మ్యాచ్ నిర్వహించారు. ఈ సమయంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ కూడా తలెత్తింది. అయితే ఈ మ్యాచ్ లో ఇరువర్గాలు ఘర్షణకు దిగి ఏకంగా కొట్టుకోవడం వరకు వచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాలలోకి వెళ్తే..
పాకిస్థాన్‌లో పేద ప్రజల వైద్యం కోసం షెహజాద్ అక్రమ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఓ ఛారిటీ మ్యాచ్‌ని మైడ్‌స్టోన్‌లోని మోటే క్రికెట్ క్లబ్‌లో నిర్వహించారు. ఈ మ్యాచ్ లో భాగంగా ఇరు వర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ తలెత్తింది.ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య మాటా మాటా పెరిగి తీవ్రస్థాయిలో గొడవ పడ్డారు.ఈ క్రమంలోనే ఈ గొడవ సద్దుమణిగే సమయానికి ఇరు వర్గాల వారి మధ్య ఇద్దరి ఆటగాళ్లకు తల పగిలి తీవ్ర గాయాలపాలయ్యారు.
ఎంతో మంచి ఉద్దేశంతో తలపెట్టిన ఈ మ్యాచ్ లో ఘర్షణ జరిగి ఈ విధంగా గాయాలు కావడంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. అసలు వీరు గొడవ పడటానికి గల కారణం ఏంటి అనే విషయం తెలియడం లేదు కానీ ఇరు వర్గాల వారు గొడవ పడిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. ఈ వీడియోలో బ్యాట్ మెన్ ఫీల్డర్ పైకి గొడవకు దిగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది అనే విషయం తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…