పేదలకోసం చారిటీ మ్యాచ్ నిర్వహించారు.. చివరికి ఆసుపత్రి పాలయ్యారు..

September 30, 2021 8:33 PM

సాధారణంగా క్రికెట్ లేదా ఏదైనా ఆటలు ఆడుతున్న సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడం సర్వసాధారణమే, ఇలాంటి ఘర్షణ మనం తరచూ చూస్తూ ఉంటాము. కానీ ఇంగ్లండ్‌లో కొందరు యువకులు పేదలకోసం చారిటీ మ్యాచ్ నిర్వహించారు. ఈ సమయంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ కూడా తలెత్తింది. అయితే ఈ మ్యాచ్ లో ఇరువర్గాలు ఘర్షణకు దిగి ఏకంగా కొట్టుకోవడం వరకు వచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాలలోకి వెళ్తే..

పాకిస్థాన్‌లో పేద ప్రజల వైద్యం కోసం షెహజాద్ అక్రమ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఓ ఛారిటీ మ్యాచ్‌ని మైడ్‌స్టోన్‌లోని మోటే క్రికెట్ క్లబ్‌లో నిర్వహించారు. ఈ మ్యాచ్ లో భాగంగా ఇరు వర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ తలెత్తింది.ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య మాటా మాటా పెరిగి తీవ్రస్థాయిలో గొడవ పడ్డారు.ఈ క్రమంలోనే ఈ గొడవ సద్దుమణిగే సమయానికి ఇరు వర్గాల వారి మధ్య ఇద్దరి ఆటగాళ్లకు తల పగిలి తీవ్ర గాయాలపాలయ్యారు.

https://twitter.com/Saj_PakPassion/status/1417421565923311616

ఎంతో మంచి ఉద్దేశంతో తలపెట్టిన ఈ మ్యాచ్ లో ఘర్షణ జరిగి ఈ విధంగా గాయాలు కావడంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. అసలు వీరు గొడవ పడటానికి గల కారణం ఏంటి అనే విషయం తెలియడం లేదు కానీ ఇరు వర్గాల వారు గొడవ పడిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. ఈ వీడియోలో బ్యాట్ మెన్ ఫీల్డర్ పైకి గొడవకు దిగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది అనే విషయం తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now