గూగుల్‌ ఇమేజెస్‌లో 241543903 అని టైప్‌ చేసి ఎంటర్‌ ప్రెస్‌ చేయండి.. జరిగే తమాషా చూడండి..!

September 21, 2021 5:01 PM

సాఫ్ట్‌వేర్‌ సంస్థకు గూగుల్‌కు చెందిన సెర్చ్‌ ఇంజిన్‌లో మనం ఏమైనా వెదకవచ్చు. వార్తలు, విషయాలు, ఫొటోలు, వీడియోలు.. ఇలా ఏ సమాచారం అయినా వెదకవచ్చు. అయితే అందులో ఇమేజెస్‌ సెక్షన్‌ను ఓపెన్‌ చేసి దాంట్లో 241543903 అని టైప్‌ చేసి ఎంటర్‌ ప్రెస్‌ చేయండి. దీంతో ఒక విచిత్రమైన సీక్వెన్స్‌ను మీరు చూస్తారు.

గూగుల్‌ ఇమేజెస్‌లో 241543903 అని టైప్‌ చేసి ఎంటర్‌ ప్రెస్‌ చేయండి.. జరిగే తమాషా చూడండి..!

పైన చెప్పిన విధంగా నంబర్‌ను గూగుల్‌ ఇమేజెస్‌లో వెదికితే అన్నీ దాదాపుగా ఒకేలాంటి ఇమేజెస్‌ వస్తాయి. ఫ్రీజర్‌లో తలపెట్టిన ఇమేజెస్‌ను మనం చూడవచ్చు. అయితే దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటంటే..

2009లో టంబ్లర్ అనే సోషల్‌ మీడియా సైట్‌లో డేవిడ్‌ హార్విట్జ్‌ అనే వ్యక్తి తాను కొత్తగా కొన్న ఫ్రిజ్‌కు చెందిన ఫొటోను పోస్ట్‌ చేశాడు. అందులో ఫ్రీజర్‌లో అతను తన తలను ఉంచి దాన్ని ఫొటో తీసి ఆ సోషల్‌ సైట్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది.

గూగుల్‌ ఇమేజెస్‌లో 241543903 అని టైప్‌ చేసి ఎంటర్‌ ప్రెస్‌ చేయండి.. జరిగే తమాషా చూడండి..!

ఆ ఫోటోకు డేవిడ్‌ పైన తెలిపిన 241543903 నంబర్‌ను టైటిల్‌గా పెట్టాడు. అయితే అప్పటి సోషల్‌ సైట్‌ ఆర్కుట్‌లో కొందరు ఇలాగే ఫొటోలు తీసి వాటికి ఇదే నంబర్‌ను పెట్టి పోస్ట్‌ చేశారు. దీంతో చాలా మంది ఇలాగే చేయడం మొదలు పెట్టారు. అలా ఈ నంబర్‌ను గూగుల్‌ ఇమేజెస్‌లో సెర్చ్‌ చేస్తే మనకు ఫ్రీజర్‌లో తలపెట్టిన ఫొటోలు రాసాగాయి. ఈ ట్రెండ్‌ చాలా రోజుల పాటు కొనసాగింది.

అందుకనే మనం ఈ నంబర్‌ను ఇప్పటికీ గూగుల్‌ ఇమేజెస్‌లో సెర్చ్‌ చేసినా మనకు అన్నీ ఫ్రీజర్‌లో తలలు పెట్టిన ఫొటోలే వస్తాయి. ఇదీ.. ఈ నంబర్‌కు, ఈ ఫోటోలకు వెనుక ఉన్న అసలు కారణం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment