Milk To Groom : శోభనం రాత్రి వధువు పాల గ్లాసుతోనే పడక గదిలోకి ఎందుకు వెళుతుందో తెలుసా..?

March 19, 2023 12:17 PM

Milk To Groom : శృంగారం అంటే అదేదో బూతులాగా చూడడం నుండి బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనదేశంలో చాలా మంది తమ శృంగార జీవితాన్ని అసంతృప్తిగానే లాగిస్తున్నారు. విశృంఖల శృంగారం తప్పు కానీ, పవిత్రమైన శృంగారానికి మన పురాణాలు కూడా పెద్ద పీట వేశాయ్. దీన్ని పక్కన పెడితే అసలు శోభనం రాత్రి పెళ్ళి కూతురు పాలగ్లాస్ తో పడక గదిలోకి ఎందుకు వెళుతుంది..? శోభనానికి పాల గ్లాస్ కు లింకేంటి..? అని చాలా మంది సరదాకో, తెలియకో అడుగుతున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు ఈ సమాధానాలు సరిపోతాయి.

పాలు తాగిన వారి శరీరం స్టిమ్యులేట్ అవుతుంది. అంటే వధువరులకు పాలు సత్వర శక్తిని ఇస్తాయ్. దీని కారణంగా వారి మొదటి రాత్రి శృంగారం సజావుగా, ఆనందంగా, సంతృప్తిగా సాగుతుందని సైన్స్ చెబుతోంది. పెళ్లి అనగానే పిండివంటలు, నాన్ వెజ్ లు పొట్టలో గట్టిగానే పడిపోతాయ్, వాటి కారణంగా వధూవరుల్లో ఎసిటిడీ వచ్చేస్తుంది. ఈ ఎసిడిటీని పాలు తగ్గిస్తాయి. ఇది కూడా ఒక కారణం. సాధారణంగా ఆడ, మగ శరీరాలు కలిసినప్పుడు అధిక స్థాయిలో వేడి పుడుతుంది. శోభనం రాత్రి వధూవరుల కలయిక వల్ల వారి శరీరాల ఉష్టోగ్రతలు అమాంతం పెరిగిపోతాయి. పాలు ఆ వేడిని తగ్గిస్తాయి.

Milk To Groom by bride what is the reason
Milk To Groom

పాలను తాగితే రక్తప్రసరణ సజావుగా సాగి దంపతుల్లో నూతనోత్తేజం వస్తుంది. పాలు ఉబ్బసాన్ని తగ్గిస్తాయి. దీని కారణంగా రతి క్రీడ సంతృప్తికరంగా సాగుతుంది. మరో విషయం ఎంటంటే మన పూర్వీకుల ప్రధాన వృత్తి పశువుల పెంపకం. కాబట్టి పాలు వాళ్ళకు చాలా అందుబాటులో ఉండే ఆహారం. దానినే కొత్తగా లైంగిక జీవితాన్ని ప్రారంభిస్తున్న వారికి కానుకగా ఇస్తారు. ఇవీ.. వ‌ధువు తొలి రాత్రి పాల‌ను వ‌రుడికి అందించ‌డం వెనుక ఉన్న కార‌ణాలు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now