మనం ఈ 3 విషయాల‌ను తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుంటాం అంట.. అవేంటో తెలుసా..?

April 29, 2023 7:56 PM

తల్లి గ‌ర్భంతో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. గ‌ర్భంతో ఉన్న స్త్రీ సంతోషంగా ఉంటే లోపల బిడ్డ కూడా అంతే సంతోషంగా ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారపుటలవాట్లు మొత్తం జీవన శైలి ప్రభావం బిడ్డపై ఉంటుంది. అందుకే గ‌ర్భంతో ఉన్నప్పుడు తల్లి నీతికథలు చదవడం, సంగీతం వినడం లాంటివి చేయాలి. తల్లి సంతోషంగా ఉండడానికి కుటుంబ సహాయం కూడా ఉండాలి. తల్లి గ‌ర్భంలో ఉన్నప్పుడే శిశువు కొన్ని విషయాలు నేర్చుకుంటుంద‌ట. అవేంటంటే..

వినికిడి, శబ్దాలను గ్రహించడం, రుచిని తెలుసుకోవడం.. ఈ మూడు విషయాలు తల్లి కడుపులో ఉన్నప్పుడే శిశువు తెలుసుకుంటాడట. గర్భిణులపై హెప్పర్ బృందం చేపట్టిన ఒక పరిశోధ‌నలో వెల్లుల్లిని తీసుకున్న‌ తల్లులకు పుట్టిన పిల్లలు 7 లేదా 8 ఏండ్లలోనే వెల్లుల్లి రుచిని ఆస్వాదిస్తున్నారట. క్యారెట్ తిన్న తల్లులకు పుట్టిన పిల్లలు 5, 6నెలలకే క్యారెట్ రుచిని గుర్తిస్తున్నారని తెలిపారు. చాలావరకు పిల్లలు తీసుకునే ఆహారం వాళ్ల అమ్మ గ‌ర్భంతో ఉన్నప్పడు తీసుకునే ఆహారాన్ని ఇష్టంగా తినడం.. వాళ్ల అమ్మ గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు ఇష్టపడని ఆహారాన్ని పిల్లలు ఇష్టపడకపోవడం ఈసారి గమనించండి.

kids learn these matters when in mothers womb

న్యూయర్క్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్త.. నవజాత శిశువులు తల్లి కడుపులో ఉన్నప్పుడే మాటలను గుర్తించడం నేర్చుకుంటారని తెలిపారు. పరిసరాల్లో ధ్వని తగినంత లేకపోతే పుట్టబోయే లేదా పుట్టిన‌ బిడ్డల్లో సంభాషణా లోపాలు ఏర్పడతాయి. పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పుడు బయటి శబ్దాలకు లోపల కదలడం.. పుట్టగానే తండ్రి మాటలని బట్టి గుర్తించడం మనం గమనిస్తాం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment