Car Steering : ఒకప్పుడు కారంటే కేవలం ధనికులకు మాత్రమే ఉండే విలాస వస్తువుగా పేరుగాంచింది. అయితే ఇప్పుడు అలా కాదు. ఎగువ మధ్యతరగతి వారు, ఆ మాటకొస్తే కొంత మంది మధ్య తరగతి ప్రజలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే కార్ అయినా అలాంటి వీల్స్ కలిగిన వేరే ఏ వాహనమైనా అందులో స్టీరింగ్ కుడి లేదా ఎడమ వైపు మాత్రమే ఎందుకుంటుంది..? మధ్యలో ఎందుకు ఉండదు..? ఎప్పుడైనా ఆలోచించారా..? అలా ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సౌతాఫ్రికా వంటి కేవలం కొన్ని దేశాల్లోనే కార్లకు స్టీరింగ్ కుడి వైపుకు ఉంటుంది. మిగతా అన్ని దేశాల్లోనూ స్టీరింగ్ ఎడమ వైపుకు ఉంటుంది. అయితే కుడి లేదా ఎడమ ఏదైనా పెద్ద తేడా ఏం లేదు. ఎటు వైపు ఉండి నడిపినా సౌకర్యవంతంగానే ఉంటుంది. కాగా కొన్ని దేశాల్లో ఒకలా, ఇంకొన్ని దేశాల్లో మరొకలా వాహనాల స్టీరింగ్‌లు ఎందుకుంటాయంటే అందుకు అక్కడి ట్రాఫిక్ రూల్సే కారణం. ఈ క్రమంలోనే ఎడమ వైపు స్టీరింగ్ కలిగిన వారు రోడ్డుపై కుడివైపుకు, కుడివైపు స్టీరింగ్ కలిగిన వారు రోడ్డుపై ఎడమవైపుకు వెళతారు. కానీ వాహనాల స్టీరింగ్ మాత్రం ఏదో ఒక వైపుకు మాత్రమే ఉంటుంది. మధ్యలో ఉండదు.
వాహనం మధ్యలో స్టీరింగ్ ఉంటే డ్రైవింగ్ చేసే వ్యక్తి రోడ్డును అన్ని వైపులా క్లియర్‌గా చూడలేడు. దీనికి తోడు స్టీరింగ్ మధ్యలో ఉంటే వాహనం ముందు భాగంలో కేవలం ఒకరు మాత్రమే కూర్చునేందుకు వీలు కలుగుతుంది. దీంతో మొత్తంగా కారులో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతుంది. వాహనంలో కుడి లేదా ఎడమ వైపుల్లో ఏదో ఒక సైడ్ మాత్రమే స్టీరింగ్ ఉంటే ఆ వాహనాన్ని సులభంగా యు టర్న్ చేయవచ్చు. మామూలు టర్న్ కూడా చేయవచ్చు. స్టీరింగ్ మధ్యలో ఉంటే కుడి లేదా ఎడమ వైపులకు తిప్పలేరు. అందువల్లే వాహనాలకు స్టీరింగ్ మధ్యలో ఉండదు. ఏదో ఒక వైపు మాత్రమే ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…