Vegetarian : మీరు శాకాహార ప్రియులా..? శాకాహారం తప్ప మాంసాహారం ముట్టుకోరా..? అయితే మీరు పప్పులో కాలేసినట్టే..! ఎందుకంటే శాకాహారం అనుకుని మీరు తింటున్న ఆహారంలో కూడా కొంత మాంసాహారం కలుస్తుందట..! ఆశ్చర్యంగా ఉందా..! కానీ ఇది నిజమే. శాకాహారంగా కనిపిస్తున్నా కొన్ని పదార్థాల్లో ఎంత లేదన్నా కొంత మాంసం లేదా దాని సంబంధ పదార్థాలు కచ్చితంగా ఉంటాయట. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర తయారు చేసే సమయంలో దాన్ని శుద్ధి చేయడం కోసం సహజసిద్ధమైన నాచురల్ కార్బన్‌ను ఉపయోగిస్తారు. అయితే ఇక్కడే విషయం అంతా ఉంది. ఆ నాచురల్ కార్బన్‌ను జంతువుల ఎముకలను కాల్చడం ద్వారా తయారు చేస్తారు. ఇప్పుడర్థమైందా..! చక్కెర కూడా మాంసాహార సంబంధ పదార్థమేనని. ఈ క్రమంలో చక్కెరను వాడాలనుకుంటే అన్‌రిఫైన్డ్ షుగర్‌ను వాడితే సరిపోతుంది. లేదంటే దాని బదులు బెల్లం కూడా ఉపయోగించవచ్చు.
కరకరలాడుతూ ఘాటు ఘాటుగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్‌లోనూ మాంసం అవశేషాలు ఉంటాయట. బీఫ్ కొవ్వు నుంచి తీసిన కొన్ని పదార్థాలను ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసేందుకు ఉపయోగిస్తారట. అయితే ఆ పదార్థాలను ముందుగా ప్రాసెస్ చేస్తారు. అనంతరం ఫ్రైస్ తయారీలో ఉపయోగిస్తారు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉన్న బ్రెడ్, గుండె ఆరోగ్యానికి మంచిది అంటూ అనేక కంపెనీలు తమ తమ బ్రెడ్లను అమ్ముతుంటాయి. అయితే వాటిలో చేపల ఆయిల్‌తోపాటు, అవిసె గింజలు, మనిషి, పంది, కోడి వెంట్రుకల నుంచి తీసిన ఎల్-సిస్టీన్ అనే పదార్థాలను ఉపయోగిస్తారట.
బీర్, వైన్ వంటి ఆల్కహాల్ డ్రింక్స్‌లోనూ మాంసం అవశేషాలు ఉంటాయట. ఫిష్ బ్లాడర్ లేదా ఎండ్రకాయ డొప్పలు లేదా జంతువుల ఎముకలు, లిగ్‌మెంట్స్ నుంచి తీసిన పలు పదార్థాలను ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ తయారీలో వాడతారట. రెస్టారెంట్లలో సూప్‌లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే వాటి తయారీలో వాడే సాస్‌లలో చేపల నుంచి తీసిన పదార్థాలను వాడతారట. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న నూనెలు గుండెకు చాలా మంచివని ఆయా కంపెనీలు తమ తమ వంట నూనెలను అమ్ముతుంటాయి. అయితే వాటిలో చేపలు లేదా గొర్రెల నుంచి తీసిన లానొలిన్ అనే పదార్థాలను వాడతారట. కూరగాయలు, పండ్ల సలాడ్స్ కోసం వాడే డ్రెస్సింగ్ ఆహార పదార్థాల్లో కోడిగుడ్ల నుంచి తీసిన అవశేషాలు ఉంటాయి. కాబట్టి సలాడ్స్‌లో కూడా మాంసాహారం ఉంటుంది.
జంతువుల మాంసం నుంచి తీసిన గెలాటిన్ అనే పదార్థం జెల్లీల్లో ఉంటుంది. అయితే ప్రస్తుతం అధిక శాతం జెల్లీల్లో గెలాటిన్‌కు బదులుగా ఇతర పదార్థాలను వాడుతున్నారు. కాబట్టి కొంత వరకు సేఫ్‌గానే ఉండవచ్చు. ఎగ్ లేకుండా తయారు చేసిన కేకులను ప్రస్తుతం ఎక్కువ మంది శాకాహారులు తింటున్నారు. అయితే వారు కేక్ మిక్స్‌లతో కేకులను తయారు చేసుకుని తింటున్నారు. ఈ క్రమంలో కేక్ మిక్స్‌లను ఒకసారి పరిశీలిస్తే వాటిలో పంది కొవ్వు నుంచి తీసిన పదార్థాలు ఉంటాయట. కాబట్టి కేక్ మిక్స్‌లపై కూడా జాగ్రత్త వహించాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…