Alcohol Spraying On Bed : ఇంట్లో నల్లులు, తలలో పేలు.. చెవి నొప్పి, దగ్గు ఇలా ఎలాంటి సమస్యనైనా చిటికెలో దూరం చేసే శక్తి ఆల్కహాల్ కి ఉంది. ఏంటి ఇన్‌డైరెక్ట్ గా ఆల్కహాల్ ప్రమోషనా అనుకుంటున్నారా.. లేదండీ బాబూ.. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. మేం మద్యం తాగమని చెప్పట్లేదు. ఆ మద్యం వలన మనం రోజూ ఎదుర్కొనే కొన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఆల్కహాల్ ను రుద్దితే అది క్రిమి సంహారిణి గా పనిచేస్తుంది. ఆల్కహాల్ ను కాస్మొటిక్స్ లో కూడా ఉపయోగిస్తారు. దీనివలన ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసా..?
ఒక బాటిల్ లో ఆల్కహాల్ తీసుకొని మంచాలపై, పరుపులపై చల్లితే నల్లుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా చల్లడం వలన నల్లులు పెట్టే గుడ్లు చనిపోతాయి. కొద్ది రోజులపాటు ఇలా చల్లితే నల్లుల బారినుండి శాశ్వత విముక్తి పొందవచ్చు. డియోడరెంట్ గా కూడా పనిచేస్తుంది. శరీరం నుంచి వచ్చే దుర్వాసన వలన మొదలయ్యే బాక్టీరియాను చంపుతుంది. అయితే ఇది తాత్కాలికంగా మాత్రమే ఉపయోగించాలి. లేకపోతే చర్మ సంబంధిత అలర్జీలు వస్తాయి. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని రెండు భాగాలు నీరు, ఒక భాగం ఆల్కహాల్ వేసి సీల్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే కూల్ ప్యాక్ తయారవుతుంది. దీన్ని శరీరంపై దెబ్బలకు ఉపశమనంలా ఉపయోగించవచ్చు.
లావెండర్ నూనె, ఆల్కహాల్ రెండింటిని కలిపి తలపై జుట్టుపై చల్లుకుంటే తలలో ఉన్న పేలను నిర్మూలించవచ్చు. ఈ విధంగా చల్లిన తర్వాత తలను దువ్వుకుంటే చనిపోయిన పేలన్నీ బయట పడతాయి. చాలా మంది తమ చెవులను శుభ్రపరుచుకునేందుకు కాటన్ బడ్స్ వాడుతుంటారు. అయితే వాటి బదులు వెనిగర్, ఆల్కహాల్ మిశ్రమం ఒక కప్ లో తీసుకొని చెవిలో వేసుకుంటే చెవిని శుభ్రపరచుకోవచ్చు. విపరీతమైన దగ్గుతో బాదపడేవారు ఆల్కహాల్ లో నీరు ,సోడా లాంటివేవి కలుపుకోకుండా రా (RAW) గా తీసుకుంటే ఉపశమనం ఉంటుంది. అలా అని ఎక్కువ ట్రై చేయకండి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…