YSRCP : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన విషయం విదితమే. అయితే ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతోంది. దీంతో ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. టీడీపీపై అనర్హత వేటు వేయించే దిశగా వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఆర్టికల్ 356ను అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రాష్ట్రపతి కోవింద్‌ను కలిశారు. అయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా కలవాల్సి ఉండగా.. ఆయన అపాయింట్‌మెంట్ లభించలేదు.
రాష్ట్రంలో జరుగుతున్న గంజాయి వ్యాపారంపై సమగ్ర విచారణతో పాటు, గత వారం టీడీపీ కార్యాలయాలు, నాయకులపై వైఎస్సార్‌సీ నేతలు, కార్యకర్తలు చేసిన విధ్వంసంపై సీబీఐ విచారణ చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్రపతిని చంద్రబాబు కోరారు. అయితే వైఎస్సార్‌సీపీ నేతలు ప్రస్తుతం ఎదురుదాడికి దిగారు. టీడీపీపై ఫిర్యాదు చేసేందుకు గురువారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం భారత ఎన్నికల సంఘాన్ని కలవనుంది.
ముఖ్యమంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున టీడీపీని రాజకీయ పార్టీగా అనర్హమైనదిగా ప్రకటించాలని వైఎస్సార్సీ ఎంపీలు ఈసీని అభ్యర్థించనున్నారు. టీడీపీ నేతలు జగన్‌ను పరుష పదజాలంతో దూషించిన వీడియోలను అందజేసి టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరనున్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు కేంద్రంలోని ఇతర అగ్రనేతలను కూడా కలవనున్నారు. ఇప్పటికే అమిత్‌షాను కలిసిన వారు ఈ వివరాలన్నింటినీ తెలిపారు. ఈ క్రమంలో అధికార పార్టీపై టీడీపీ బురదజల్లుతోందని వైకాపా నేతలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు కారణం చంద్రబాబునాయుడేనని వైసీపీ నేతలు చెప్పబోతున్నారు. ఆయనను రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని కోరేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి వైసీపీ నేతల ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…