Tollywood : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టాలీవుడ్ సినిమాల విడుదలకు టికెట్ల విషయంలో తీవ్ర వివాదం కొనసాగుతోంది. సినిమా టికెట్ల ధరల విషయంలో ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. టాలీవుడ్ నుండి ఎన్ని విమర్శలు వస్తున్నా.. వైసీపీ ప్రభుత్వం మాత్రం తాము చెప్పిందే వేదం అంటోంది.
ఆంధ్రప్రదేశ్ తెచ్చిన చట్టసవరణలతో అదనపు షోలు రద్దు కావడంతోపాటు టికెట్ ధరల్ని కూడా తగ్గించేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారు. రీసెంట్ గా టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్తే థియేటర్స్ క్లోజ్ అయిపోతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తీరుపై టాలీవుడ్ ప్రముఖులు కామెంట్స్ చేస్తుంటే.. స్టార్ హీరోలపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఏపీ అంతా వరదలతో అల్లాడిపోతుంటే స్పందించకుండా ఉన్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల అభిమానం వల్లే హీరోలయిన వారు.. ఇప్పుడు ఆ అభిమానులు కష్టాల్లో ఉంటే స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లుఅర్జున్ లు ఒక్కరు కూడా ఏపీ ప్రజల కష్టాలపై స్పందించలేదని అన్నారు.
వీళ్ళు ప్రజల కష్టాలపై స్పందించరు కానీ సినిమా టికెట్ల రేట్లు మాత్రం పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారని కామెంట్ చేశారు. గతంలో ప్రజలకు ఎప్పుడైనా కష్టం వస్తే సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు స్పందించి సహాయం చేశారని నల్లపురెడ్డి అన్నారు. అందుకే వారిద్దరూ ఎప్పటికీ సినీ ఇండస్ట్రీకి రెండు కళ్ళు అని అన్నారు. ఇప్పుడున్న హీరోలు సినిమాల్లో నటిస్తూ కోట్ల డబ్బును వెనకేసుకుంటున్నారని, వారిని హీరోలుగా మార్చిన ప్రజల్ని మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…