ఎంపీ గోరంట్ల మాధ‌వ్ కి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్ చిట్ ఇచ్చిన‌ట్లే..? ఆయ‌న సేఫ్‌..?

August 19, 2022 2:20 PM

హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న‌గ్నంగా త‌న శ‌రీరాన్ని ఒక మ‌హిళ‌కు చూపుతున్న‌ట్లుగా ఉన్న ఒక వీడియో కాల్ రికార్డింగ్ లీక్ అవ‌డం వ‌ల్ల వివాదం న‌డుస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. గ‌త నాలుగు రోజులుగా అటు సోష‌ల్ మీడియాలో ఇటు టీవీ, ప్రింట్ మీడియాలోనూ ఈ వివాదం తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. దీని వ‌ల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని వ‌ర్గాల నుండి తీవ్ర‌ విమ‌ర్శ‌ల‌ని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. అయితే ఈ విష‌యంలో స‌ద‌రు ఎంపీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ చిట్ ఇచ్చిన‌ట్లుగానే క‌నిపిస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి తాజాగా ఓ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ ఎంపీ మాధ‌వ్ ఆ వీడియో కాల్ ద్వారా ఏ మ‌హిళ‌ని లైంగిక వేధింపుల‌కు గురి చేయ‌లేద‌ని, ఒకవేళ చేస్తే ఎవ‌రైనా త‌న మీద కంప్లైంట్ చేశారా.. అని ప్ర‌శ్నించారు. ఒక వ్య‌క్తి ప్రైవేటుగా ఆ వీడియోలో ఉన్న‌ట్టుగా చేసుకోవ‌డంలో త‌ప్పేముంద‌ని అన్నారు. అయితే ఆయ‌న చేసిన ఈ వాఖ్య‌లు.. వివాదం మొద‌లైన రోజు పార్టీ చెప్పిన‌ట్టుగా.. ఆ వీడియో నిజ‌మ‌ని తేలితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పిన దానికి విరుద్దంగా ఉన్నాయి. దీంతో ఎంపీ మాధ‌వ్ పై పార్టీ ఇక ఎటువంటి చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది.

ysr congress party reportedly will give clean chit to mp gorantla madhav

కాగా ఎంపీ మాధ‌వ్ కి ఇటువంటి వివాదాలు కొత్తేమీ కాదని చెబుతున్నారు. రాజ‌కీయాల్లోకి రాక ముందు ఈయన అనంత‌పురం జిల్లాలో క‌దిరి సీఐగా ప‌ని చేశారు. ఆ స‌మ‌యంలో ఆయన అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. ప్ర‌జ‌ల‌తో చాలా దురుసుగా ప్ర‌వ‌ర్తించేవాడని స‌మాచారం. అప్ప‌ట్లో ఈయ‌నపై ఒక అత్యాచారం కేసు కూడా న‌మోదైందని మీడియాలో ప్ర‌చారం అవుతోంది. ఇక భ‌విష్య‌త్తులో పార్టీ ఏం చేస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now