Ramya Krishnan : వామ్మో.. ఒక్క రోజుకు ర‌మ్య‌కృష్ణ తీసుకునే రెమ్యున‌రేష‌న్ తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..!

July 14, 2022 5:57 PM

Ramya Krishnan : తెలుగు ప్రేక్ష‌కులకు శివ‌గామిగా పేరుగాంచిన ర‌మ్య‌కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె గ‌త 40 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతూ వ‌స్తోంది. హీరోయిన్‌గా ఒక‌ప్పుడు ఎంత‌గానో అల‌రించిన ర‌మ్య‌కృష్ణ ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా అద్భుతంగా న‌టిస్తోంది. ఆమె న‌టించిన బాహుబ‌లి సినిమా ఎంత హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఇందులో శివ‌గామిగా ర‌మ్య‌కృష్ణ అద‌ర‌గొట్టేసింది. దీంతో ఆమెకు ఆఫ‌ర్లు వెల్లువెలా వ‌స్తున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ రాణిస్తున్న సీనియ‌ర్ హీరోయిన్ల‌లో ర‌మ్య‌కృష్ణ ఒక‌రని చెప్ప‌వ‌చ్చు.

ఇక ర‌మ్య‌కృష్ణ తెలుగులోనే కాకుండా ప‌లు ఇత‌ర భాష‌ల‌కు చెందిన చిత్రాల్లోనూ న‌టిస్తూ అల‌రిస్తోంది. ఈమె ఎక్కువ‌గా త‌మిళ చిత్రాల్లోనూ న‌టించింది. అయితే బాహుబ‌లి మూవీ ద్వారా ఈమెకు వ‌చ్చినంత పేరు మ‌రే చిత్రానికి రాలేద‌నే చెప్పాలి. ఆ పాత్ర‌లో ఆమె త‌ప్ప ఎవ‌రు చేసినా అంత‌గా మెప్పించ‌లేక‌పోయేవార‌నే చెప్ప‌వ‌చ్చు. అంత‌లా ఆమె శివ‌గామి పాత్ర‌లో జీవించేసింది.

you will be surprised to know about Ramya Krishnan remuneration
Ramya Krishnan

కాగా ర‌మ్య‌కృష్ణ ప్ర‌స్తుతం రెమ్యున‌రేష‌న్ విష‌యంలోనూ త‌గ్గేదేలే.. అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆమె చిన్న బ‌డ్జెట్ చిత్రాల్లో న‌టిస్తే రోజుకు రూ.7 ల‌క్ష‌లు తీసుకుంటుంద‌ని స‌మాచారం. అదేవిధంగా పెద్ద బ‌డ్జెట్ సినిమాలు అయితే రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు చార్జ్ చేస్తుంద‌ని తెలుస్తోంది. ఇలా ర‌మ్య‌కృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అద‌ర‌గొడుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఈమె ప్ర‌స్తుతం త‌న భ‌ర్త కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న రంగ మార్తాండ అనే మూవీలో న‌టిస్తోంది. ఈమె త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now