Yashoda Movie : ఓటీటీలో స‌మంత య‌శోద మూవీ.. ఎందులో, ఎప్పుడు అంటే..?

December 7, 2022 10:15 AM

Yashoda Movie : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న అనంత‌రం స‌మంత చేసిన తొలి స్ట్రెయిట్ చిత్రం.. య‌శోద‌. ఆమె న‌టించిన కాతువాకుల రెండు కాద‌ల్ అనే మూవీ కూడా విడాకుల త‌రువాతే రిలీజ్ అయింది. కానీ అది త‌మిళ చిత్రం. తెలుగులోనూ డ‌బ్బింగ్ చేశారు. అయితే ఇక్క‌డ ప్ర‌మోష‌న్స్ అంత‌గా చేయ‌లేదు. దీంతో తెలుగులో ఈ మూవీ ఫ్లాప్ అయింది. త‌మిళంలో మాత్రం మంచి విజ‌యాన్నే సాధించింది. ఆ త‌రువాత య‌శోద మూవీ వ‌చ్చింది. ఇది స్ట్రెయిట్ తెలుగు మూవీ. అయితే యశోద మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యాన్ని సాధించింది. దీంతో స‌మంత‌కు కాస్త ఊర‌ట ల‌భించిన‌ట్లు అయింది.

అయితే య‌శోద మూవీ త్వ‌ర‌లోనే ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో య‌శోద డిజిట‌ల్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. దీంతో అమెజాన్‌లో ఈ మూవీని రిలీజ్ చేయ‌నున్నారు. డిసెంబ‌ర్ 9న అమెజాన్‌లో విడుద‌ల‌వుతుంద‌ని ఒక ప్ర‌క‌ట‌న చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ ఆ యాప్‌లో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం, హిందీ భాష‌ల్లో అందుబాటులోకి రానుంది. సైన్స్ ఫిక్ష‌న్‌, మిస్ట‌రీ, థ్రిల్ల‌ర్ క‌థాంశంతో వ‌చ్చిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. స‌మంత న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

Yashoda Movie to stream on ott know the app and details
Yashoda Movie

ఇక స‌మంత ప్ర‌స్తుతం మ‌యోసైటిస్ అనే వ్యాధితో బాధ‌ప‌డుతోంది. య‌శోద రిలీజ్‌కు ముందు ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. దీంతో అంద‌రూ ఆందోళ‌న చెందారు. అయితే ఆమె ప‌రిస్థితి క్రిటిక‌ల్‌గా ఉంద‌ని.. దీంతో ట్రీట్‌మెంట్ కోసం అమెరికాకు వెళ్లింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌ను ఆమె టీమ్ ఖండించ‌లేదు. స్పందించ‌లేదు. స‌మంత ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఖుషి అనే మూవీలో న‌టిస్తుండ‌గా.. ఈ మూవీ జ‌మ్మూ కాశ్మీర్ లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. స‌మంత‌కు ఆరోగ్యం బాగాలేక‌పోవ‌డంతో మూవీ షూటింగ్‌ను ఆపివేశారు. అలాగే శాకుంత‌లం అనే ఇంకో మూవీలోనూ స‌మంత న‌టించ‌గా.. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్త‌యింది. విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ఈ మూవీని రిలీజ్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now