Yami Gautam : అందాల ముద్దుగుమ్మల మేకప్ వెనుక దాగి ఉన్న చీకటి కోణాల గురించి తెలిస్తే కంట కన్నీరు రాక మానదు. వెండితెరపై అందంగా కనిపించే అందాల భామలు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అందంగా కనపడాలని ఒక్కోసారి వారు చేయించుకునే సర్జరీలు వికటించి చాలా బాధలు కూడా పడుతుంటారు. ఈ లిస్ట్‌లో ఫెయిర్ అండ్ లవ్లీకి అంబాసిడర్ గా వ్యవహరించిన యామి గౌతమ్ కూడా ఉంది.
సుదీర్ఘ కాలం పాటు ఫెయిర్ అండ్ లవ్లీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న యామి గౌతమ్ అనూహ్యంగా తన చర్మ సమస్యను బయటకు చెప్పి అందరినీ ఆశ్చర్య పర్చింది. సోషల్ మీడియాలో చర్మ సమస్యల గురించి మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ.. తనకు కెరాటోసిస్ పిలారిస్ అనే చర్మ సంబంధిత సమస్య ఉందని.. ఆ సమస్య కారణంగా తన ముఖంపై చిన్న గడ్డలు ఏర్పడతాయని పేర్కొంది. వాటిని తొలగించడం సాధ్యం కాదు. టీనేజ్ నుండి ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను.. అని తెలిపింది.
ఈ సమస్యకు పరిష్కారం లేదని వైద్యులు చెప్పారు. ఇన్ని రోజులుగా పడుతున్న బాధ, భయాలను వదిలించుకునేందుకు గాను బయటకు ఈ విషయాన్ని చెప్పాలనే నిర్ణయానికి వచ్చాను.. అని యామి పేర్కొంది. ఎలాంటి సమస్య అయినా.. ఎప్పటికి అయినా నిజాన్ని స్వీకరించి ముందుకు సాగి పోక తప్పదు. కనుక ఈ విషయంలో తాను ఇంకా ఎక్కువగా ఆలోచించి బాధ పడాలని అనుకోవడం లేదని యామి స్పష్టం చేసింది. అయితే ఆమె చర్మ సమస్యకు ఫెయిర్ అండ్ లవ్లీ ఏమైనా కారణం అయి ఉంటుందా.. అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…