Xiaomi : బాబోయ్‌.. కేవ‌లం 3 రోజుల్లోనే 1 ల‌క్ష టీవీల‌ను అమ్మిన షియోమీ..

October 6, 2021 1:09 PM

Xiaomi : మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీ 3 రోజుల వ్య‌వ‌ధిలోనే త‌న ఎంఐ బ్రాండ్‌కు చెందిన స్మార్ట్ టీవీల‌ను 1 ల‌క్ష యూనిట్ల మేర అమ్మిన‌ట్లు తెలియ‌జేసింది. దీవాలి విత్ ఎంఐ పేరిట ఆ సంస్థ ఓ ప్ర‌త్యేక సేల్ ను ఇప్ప‌టికే నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఆ మొత్తంలో టీవీలు అమ్ముడైన‌ట్లు ఆ కంపెనీ తెలియ‌జేసింది.

Xiaomi sold over 1 lakh smart tvs in 3 days

ఈ సేల్‌లో భాగంగా ఎంఐ ఆన్ లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌లో షియోమీ త‌న స్మార్ట్ టీవీల‌ను చాలా త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తోంది. అందుక‌నే కేవ‌లం 3 రోజుల్లోనే ఏకంగా 1 ల‌క్ష టీవీల‌ను ఆ సంస్థ విక్ర‌యించింది.

4కె టీవీల‌ను కొనుగోలు చేసేందుకు వినియోగ‌దారులు ఎక్కువ‌గా ఆస‌క్తిని చూపిస్తున్నార‌ని షియోమీ తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే 50, 32. 43 ఇంచుల టీవీల‌ను ఎక్కువ‌గా కొంటున్న‌ట్లు తెలిపింది. వాటిపై డిస్కౌంట్ల‌ను అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now