Samantha : స‌మంత సాంగ్ వివాదంపై స్పందించిన రచయిత.. ఏమన్నారంటే..?

December 23, 2021 9:17 PM

Samantha : సుకుమార్ తెర‌కెక్కించిన పుష్ప సినిమా కోసం స‌మంత ఐటమ్‌ సాంగ్ చేసిన విష‌యం తెలిసిందే. ‘ఊ అంటావా మావా.. ఉహూ.. అంటావా’ అంటూ సామ్ చేసిన ఈ ఐటమ్ సాంగ్ విడుదలైనప్పటి నుంచి యూట్యూబ్ లో భారీ వ్యూస్, లైకులతో దూసుకెళ్తోంది. అయితే ఈ సాంగ్ లో సామ్ హాట్ నెస్ కు యూత్ కు మ్యాడ్ నెస్ వచ్చేసిందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల‌ని అంతలా ఊపేసిన ఈ సాంగ్ లిరిక్స్ కొంతమంది మగజాతి ఆణిముత్యాలను హర్ట్ చేయడమే కూడా హాట్ టాపిక్ అయ్యింది.

writer responded on Samantha song

పురుషుల స్వభావాన్ని కించపరిచేలా ఇందులో లిరిక్స్ ఉన్నాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా ‘ఊ అంటావా’ పాట వివాదంపై తమిళ వెర్షన్‌ రచయిత వివేక్‌ స్పందించారు. ‘‘పాటపై కొంతమంది పురుషులు మాత్రమే అభ్యంతరం తెలిపారు. ఎక్కువశాతం మంది థియేటర్‌లో ఆ పాటను ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అని అన్నారు. అల్లు అర్జున్‌ సైతం ఇటీవల ‘పుష్ప’ ప్రమోషన్స్‌లో ఈ వివాదంపై స్పందించిన విషయం తెలిసిందే.

‘‘ప్రస్తుతం మనం సమాజంలో ఏదైతే చూస్తున్నామో అదే పాటలా రచించారు. అందులో ఉన్న లిరిక్స్‌ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి’’ అని తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ మూవీ అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా నమోదు చేస్తున్న పుష్ప వసూళ్లు బన్నీ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now