Viral Video : వామ్మో.. షాప్‌లో ఆంటీని చూడండి.. ఎంత తెలివిగా ఇంకో మ‌హిళ ఫోన్ ను కొట్టేసిందో.. వీడియో..!

May 15, 2022 5:28 PM

Viral Video : బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఉన్న‌ప్పుడు మనం చాలా ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. ముఖ్యంగా మ‌న సామాన్ల ప‌ట్ల మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండాలి. బంగారం, ఫోన్లు, ఇత‌ర విలువైన వ‌స్తువులు ఏవి మ‌న ద‌గ్గ‌ర ఉన్నా స‌రే.. వాటిని ఎల్ల‌ప్పుడూ ఓ కంట క‌నిపెడుతుండాలి. లేక‌పోతే చోరాగ్రేస‌రులు ఉంటారు.. వారు ఎలా దొంగ‌త‌నం చేస్తారంటే.. అస‌లు మ‌న‌ల్ని ట‌చ్ చేసిన‌ట్లు కూడా మ‌న‌కు తెలియ‌దు. అంత చాక‌చ‌క్యంగా మ‌న ద‌గ్గ‌ర ఉన్న వ‌స్తువుల‌ను కొట్టేస్తారు. స‌రిగ్గా ఓ మహిళా కూడా ఇలాగే చేసింది. త‌న ప‌క్క‌నే ఉన్న ఇంకో మ‌హిళ హ్యాంగ్ బ్యాగ్ నుంచి చాలా తెలివిగా ఫోన్‌ను కొట్టేసింది. త‌రువాత ఎంచ‌క్కా అక్క‌డి నుంచి వెళ్లిపోయింది.

వైర‌ల్ వీడియోలో ఉన్న ప్ర‌కారం.. ఓ ర‌ద్దీగా ఉన్న షాపులో ఓ మ‌హిళ నిల‌బ‌డి ఉంది. అక్క‌డికి వ‌చ్చిన పింక్ క‌ల‌ర్ చుడీదార్ ధ‌రించిన ఓ మ‌హిళ త‌న ప‌క్క‌నే ఉన్న మ‌హిళ‌ను వ‌స్తూ వ‌స్తూనే ప‌క్క‌న ఢీకొడుతూ నిలుచుంది. దీంతో ఆమె పింక్ క‌ల‌ర్ చుడీదార్ మ‌హిళ‌ను ఒక్క‌సారిగా అలా చూసింది. అయితే ఆ ఆంటీ త‌న ప‌క్కనున్న మ‌హిళ‌ను తాకుతూ నిలుచుని ఏదో ఆర్డ‌ర్ చేసిన‌ట్లు న‌టించింది. త‌రువాత ఆ మ‌హిళ ఏమ‌రుపాటుగా ఉన్న‌ప్పుడు వెంట‌నే త‌న ఎడ‌మ చేతిని ఉప‌యోగించి ఆ మ‌హిళ బ్యాగ్‌లో ఉన్న ఫోన్‌ను కొట్టేసి త‌న బ్యాగ్‌లో వేసుకుంది. ఇక వెంట‌నే అక్క‌డి నుంచి వెళ్లిపోయింది.

woman steals mobile phone from another womans bag Viral Video
Viral Video

అయితే ఆ ప‌క్క‌నే ఉన్న మ‌హిళ త‌న బ్యాగ్‌ను ఎవ‌రో ట‌చ్ చేశారని అనిపించి ఒక్క‌సారి చూసుకుంది. కానీ అప్ప‌టికే ఆ ఆంటీ ఆమె ఫోన్‌ను కొట్టేసింది. ఈ క్ర‌మంలోనే ఈ దృశ్యాల‌న్నీ అక్క‌డే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. దీంతో ఆ ఆంటీ నేర్ప‌రిత‌నం చూసి నెటిజ‌న్లు షాక‌వుతున్నారు. ఆమెను అలా చూసి నెటిజ‌న్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. మ‌న చుట్టూ ఉన్న‌వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. లేదంటే ఇలాగే జ‌రుగుతుందని అంటున్నారు. ఇక ఆ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now