Viral Video : శ్ర‌ద్ధాంజ‌లి స‌భ అని పెట్టి.. బెల్లి డ్యాన్స్‌లు ఏంది సామీ.. వీడియో..!

May 15, 2022 6:31 PM

Viral Video : సాధార‌ణంగా ఇంట్లో మ‌నం ఎవ‌రైనా కుటుంబ స‌భ్యులు లేదా తెలిసిన వారు, బంధువులు లేదా స్నేహితులు చ‌నిపోతే విల‌పిస్తాం. మ‌రీ వారు చ‌నువుగా ఉంటే ఆ బాధ ఇంకాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే అలా చ‌నిపోయిన వారిని నిత్యం స్మ‌రించుకుంటూ ఉంటాం. అలాగే వారి పేరిట కొంద‌రు సంస్మ‌ర‌ణ స‌భ లేదా శ్ర‌ద్ధాంజ‌లి స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తుంటారు. వారు చేసిన ప‌నుల‌ను, వారితో త‌మ‌కున్న అనుబందాన్ని, జ్ఞాప‌కాల‌ను ఆ సభ సంద‌ర్భంగా గుర్తు చేసుకుని విచారిస్తుంటారు. ఇది స‌హ‌జంగానే ఎక్క‌డైనా జ‌రిగేదే. కానీ అక్క‌డ మాత్రం ఈ స‌భ‌ను చాలా వెరైటీగా ఏర్పాటు చేశారు.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వృద్ధ దంప‌తుల‌కు సంస్మ‌ర‌ణ స‌భ నిర్వ‌హిస్తున్న దృశ్యాల‌ను చూడ‌వ‌చ్చు. అయితే సంస్మ‌ర‌ణ స‌భ అంటే ఆధ్యాత్మిక ప్ర‌వ‌చాలో.. భ‌క్తి గీతాలో.. లేక ఎవ‌రైనా ప్ర‌సంగాలో చేస్తారు. కానీ వారు మాత్రం ఏకంగా రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో ఓ డ్యాన్స‌ర్ స‌ల్మాన్ ఖాన్ కు చెందిన వాంటెడ్ అనే సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. ఇంకా విచిత్రం ఏమిటంటే.. ఆమె ఆ పాట‌కు బెల్లీ డ్యాన్స్ చేసింది.

woman danced on stage which arranged for funeral meeting Viral Video
Viral Video

అయితే అక్క‌డ శ్ర‌ద్ధాంజ‌లి స‌భ అని పెట్టి ఉండ‌డాన్ని స్టేజి బ్యాన‌ర్‌పై చూడ‌వ‌చ్చు. కానీ ఆమె అలా బెల్లీ డ్యాన్స్ చేస్తుంటే ఎవ‌రూ వ‌ద్ద‌ని చెప్ప‌లేదు. పైగా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ దృశ్యాల‌ను ఫోన్‌లో బంధించి అనంత‌రం ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజ‌న్లు అనేక ర‌కాల కామెంట్లు పెడుతున్నారు. శ్ర‌ద్ధాంజ‌లి స‌భ అని పెట్టి ఇలాంటి డ్యాన్స్‌లు ఏంది సామీ.. కొంచెమైనా సిగ్గు లేదా.. అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Meemlogy (@meemlogy)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now