RRR నుంచి ఆ సీన్‌ను రాజ‌మౌళి ఎందుకు తొలగించారు..?

June 22, 2022 8:08 PM

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన RRR సినిమా ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీ ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శితం అవుతూనే ఉంది. ఇక ఓటీటీలోనూ ఈ మూవీ ఘ‌న విజ‌యాన్ని సాధించి రికార్డు స్థాయిలో వ్యూస్‌ను రాబ‌డుతోంది. ప్ర‌స్తుతం విదేశీయులు ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అయితే తాజాగా RRRకు సంబంధించి ఒక వార్త వైర‌ల్‌గా మారింది. అదేమిటంటే..

RRR మూవీలో చ‌ర‌ణ్ అల్లూరిగా, తార‌క్ భీమ్‌గా క‌నిపించిన విష‌యం విదిత‌మే. అయితే మూవీ విడుద‌ల‌కు ముందు సినిమా నిడివిని త‌గ్గించ‌డం కోసం కొన్ని సీన్ల‌ను డిలీట్ చేశారు. వాటిల్లో రామ్ చ‌ర‌ణ్ బాల్యం సీన్ కూడా ఒక‌టి ఉంది. ఇది కాన్సెప్ట్ ఆర్ట్ సీన్‌. ఇందులో చ‌ర‌ణ్ చిన్నారిగా క‌నిపిస్తాడు. పండితుల ఆశీర్వ‌చ‌నాలు తీసుకుంటుంటాడు. అత‌ని దగ్గ‌ర అగ్ని ఉంటుంది. అగ్ని సాక్షిగా అల్లూరి పండితుల స‌మ‌క్షంలో ఆశీస్సుల‌ను తీసుకుంటాడు. అయితే ఈ కాన్సెప్ట్ ఆర్ట్ సీన్ సినిమాలో లేదు.

why Rajamouli deleted that scene from RRR movie
RRR

కాగా ఈ సీన్‌ను RRR మూవీ కోసం ప‌నిచేసిన కాన్సెప్ట్ డిజైన‌ర్ విశ్వ‌నాథ్ సుంద‌రం త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ సీన్ వైర‌ల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజ‌న్లు చాలా మంది ఇంత మంచి సీన్‌ను సినిమా నుంచి ఎందుకు తొల‌గించారు.. అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సీన్ల‌ను ఇలాగే సినిమా నుంచి డిలీట్ చేశారని.. వాటిని అన‌వ‌స‌రంగా తొల‌గించారని అంటున్నారు.

అయితే డిలీట్ చేసిన సీన్ల‌ను క‌నీసం యూట్యూబ్‌లో అయినా రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని ప్రేక్ష‌కులు కోరుతున్నారు. మ‌రి ఆ సీన్ల‌ను మేక‌ర్స్ యూట్యూబ్‌లో పెడ‌తారా.. లేదా.. అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీని డీవీవీ దాన‌య్య నిర్మించ‌గా.. ఇందులో హాలీవుడ్ తార ఒలివియా మోరిస్‌, బాలీవుడ్ న‌టులు ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌ల‌తోపాటు శ్రియ‌, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌ల్లో క‌నిపించారు. ఎంఎం కీర‌వాణి ఈ మూవీకి సంగీతం అందించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now