NTR : ఎన్టీఆర్ ఇంత‌ స‌డెన్‌గా హ‌నుమాన్ దీక్ష చేప‌ట్ట‌డానికి గ‌ల కార‌ణం అదే..?

April 20, 2022 12:55 PM

NTR : ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప‌ల‌క‌రించిన ఎన్టీఆర్ త్వ‌ర‌లో త‌న 30వ సినిమాలో అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ అయ్య‌ప్ప మాల ధ‌రించ‌గా, ఎన్టీఆర్ హ‌న‌మాన్ దీక్ష తీసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల త‌ర్వాత తార‌క్ మాల‌ధార‌ణ తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అన్న‌ట్టుగానే జూనియ‌ర్ ఆంజ‌నేయ స్వామి దీక్ష తీసుకొని అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. తొలిసారి ఎన్టీఆర్ స్వామి మాల ధ‌రించ‌గా, ఇంత స‌డెన్‌గా ఆయ‌న దీక్ష ఎందుకు తీసుకున్నార‌నే ఆతృత అంద‌రిలోనూ ఉంది.

why NTR suddenly took Hanuman Deeksha this may be the reason
NTR

ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు రామ్ చరణ్ ఇప్పుడు గురు స్వామి అయ్యారు. మరి ఆయన ఏమన్నా సూచించారా ? ఈ దీక్ష చేస్తే మంచిది అని ? ఎన్టీఆర్ తల్లి, భార్య కూడా దైవ భక్తి విషయంలో కాస్త గట్టి నమ్మకాలు ఉన్నవారే కాబ‌ట్టి వారేమైనా చెప్పారా ? లేదంటే ఎన్టీఆర్ జాత‌క‌రీత్యా ఎవ‌రైనా పండితులైనా చెప్పి ఉంటారా.. అనే చ‌ర్చ ఇప్పుడు టాలీవుడ్‌లో న‌డుస్తోంది. అయితే విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. ఎన్‌టీఆర్ త‌న జాత‌కంలో ఉన్న దోషాల కార‌ణంగానే హ‌నుమాన్ దీక్ష చేప‌ట్టార‌ని.. దీంట్లో కుటుంబ స‌భ్యుల ఒత్తిడి కూడా కొంత మేర ఉంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఇదే విష‌యం హాట్ టాపిక్ అవుతోంది. ఇక దీక్ష పూర్త‌యిన త‌ర్వాత ఎన్టీఆర్.. కొర‌టాల మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

ఇంత వరకూ కెరీర్ లో ఫ్లాప్ అనే మాట తెలియని దర్శకుడు కొరటాల. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆయన పక్కాగా స్కెచ్ వేసుకున్నారట. గతంలో ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాను తీసి భారీ సక్సస్ అందుకున్నాడు. ఆచార్య ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ సినిమా గురించి రకరకాల ప్రశ్నలు కొరటాలకు ఎదురవుతున్నాయి. వీటిపై టాలీవుడ్ డైరెక్టర్ స్పందిస్తూ.. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ నుంచి షూటింగ్‌ మొదలవుతుంద‌న్నారు కొరటాల శివ.

ntr

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now