Mahesh Babu : అంత స్టార్ హీరో అయి ఉండి కూడా.. మ‌హేష్ బాబు అంత సీక్రెట్‌గా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చింది..?

April 20, 2022 6:30 PM

Mahesh Babu : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో మ‌హేష్ బాబు, న‌మ్ర‌త జంట ఒక‌టి. మాజీ మిస్ ఇండియా యూనివర్స్, నటి నమ్రతా శిరోద్కర్‌ని మ‌హేష్ వివాహం చేసుకోవాల‌ని అనుకున్న‌ప్పుడు కృష్ణ అస్స‌లు ఒప్పుకోలేద‌ని టాక్. ఆ కార‌ణంగానే వీరిద్ద‌రి వివాహం చాలా సీక్రెట్‌గా, సింపుల్‌గా జ‌రిగింద‌ని అంటుంటారు. హీరోయిన్‌గా చేస్తున్న న‌మ్ర‌త‌ను పెళ్ళి చేసుకోవడం కృష్ణ‌కు ఇష్టం లేదట‌. అంతేకాకుండా నమ్రత తెలుగు అమ్మాయి కాకపోవడం వల్ల కృష్ణ పెళ్లికి నిరాక‌రించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి ఇందులో నిజం ఎంతో ఉందో తెలియ‌దు కానీ మొత్తానికి వాళ్లిద్ద‌రి వివాహం చాలా సింపుల్‌గా జ‌రిగింది.

why Mahesh Babu married very secretly even if he is big actor
Mahesh Babu

న‌మ్రత, మహేష్‌లది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. 2000 సంవత్సరంలో విడుదలైన వంశీ సినిమాలో నమ్రత, మహేష్ కలిసి నటించారు.ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఐదేళ్లు ప్రేమించుకున్న ఈ జంట.. 2005 ఫిబ్రవరి 10న‌ తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లిచేసుకున్నారు. ముంబైలో జరిగిన వీరి వివాహానికి తిరుపతి నుంచి పురోహితులు వెళ్లారు. పెళ్లి తరవాత నమ్రత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.

2006లో కుమారుడు గౌతమ్ కృష్ణకు జన్మనిచ్చిన నమ్రత.. 2012లో సితార కు జ‌న్మ‌నిచ్చింది. ప్రస్తుతం మహేష్, నమ్రత అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. న‌మ్ర‌త అయితే ఒక‌వైపు కుటుంబానికి సంబంధించిన అన్ని ప‌నుల‌నూ చక్క‌బెడుతూ మ‌రోవైపు మ‌హేష్ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు స‌జావుగా సాగేలా చూస్తుంటుంది. అయితే నమ్రత విషయం తన తండ్రి కృష్ణకు చెప్పినపుడు.. ఆయన అంత ఈజీగా ఏం ఒప్పుకోలేద‌ని ఓ సంద‌ర్భంలో అన్నారు మహేష్ బాబు. ఆయన్ని ఒప్పించడానికి కాస్త టైమ్ పట్టిందని.. నువ్వు ష్యూరా అని రెండు మూడు సార్లు అడిగిన తర్వాత.. నీ ఇష్టం అన్నార‌ని చెప్పుకొచ్చారు మహేష్ బాబు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now