Chalaki Chanti : చ‌లాకీ చంటి బిగ్ బాస్ లోకి అందుక‌నే వెళ్లాడా..? అస‌లు కార‌ణం అదే..!

September 8, 2022 9:47 PM

Chalaki Chanti : బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 6వ సీజన్ గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. నాగార్జున హోస్టింగ్ తో మొదటిరోజు కంటెస్టెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా హౌస్ లోకి అడుగు పెట్టారు. ఎవరికి వారు కాన్ఫిడెంట్ గా మేమే గెలుస్తాము అని ధీమాగా చెబుతున్నారు. ఇక హౌస్ లోకి వెళ్లే ముందు చలాకీ చంటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. మొదట సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కమెడియన్ చంటి ఆ తరువాత జబర్దస్త్ లోకి వచ్చి చలాకీ చంటిగా మారిపోయాడు.

అందులో కొన్నాళ్ల పాటు మంచి గుర్తింపును అందుకున్న చంటి అనంతరం కొన్ని విబేధాలు రావడంతో షో నుంచి బయటకు వచ్చేశాడు. ఎక్కువగా రెమ్యునరేషన్ విషయంలో విబేధాలు వచ్చినట్లు టాక్ అయితే వస్తోంది. తనను వెళ్లగొట్టడానికి జబర్దస్త్ లో జరిగిన కుట్రలను వెల్లడించాడు. నాగార్జున నోట తన చంటి అనే పేరు వినాలని ఆశించానన్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు 6కు వచ్చేముందు మల్లెమాలతో జరిగిన విషయాలను రివీల్ చేశాడు. త‌న రెమ్యున‌రేష‌న్ పెంచ‌మ‌ని కోర‌గా, మల్లెమాల వాళ్లు.. నీ టాలెంట్ కు ఇదే ఎక్కువ అనడం తనను బాధించిందన్నారు.

why Chalaki Chanti gone into bigg boss this is the reason
Chalaki Chanti

మరోవైపు తాను ముక్కుసూటి మనిషినని, తప్పు జరిగితే వెంటనే ప్రశ్నిస్తానని అన్నారు. అందుకే తనను కోపిష్టి, పొగరు, అటిట్యూడ్, ఈగో అంటూ తనను ముద్రవేశారని తెలిపారు. చంటి బిగ్ బాస్ హౌజ్‌లో ర‌చ్చ చేయ‌డంతో పాటు ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తాడ‌ని అంద‌రు భావిస్తున్నారు. బింబిసార స్టైల్ లోనే ఎంట్రీ ఇస్తూ చంటిసారగా అడుగు పెట్టాడు. తెలుగు తెలిసిన ప్రతీ ఒక్కరు కూడా నాకే ఓటు వేయాలని.. తను సోలోగా ఫైట్ చేయబోతున్నట్లు చెప్పాడు. మరి బిగ్ బాస్ లో చలాకీ చంటి ఎన్ని రోజులు నిలదొక్కుకుంటాడో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now