Aditya 369 : ఆదిత్య 369 వంటి అద్భుతమైన చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న నటి ఎవరో తెలుసా..!?

Aditya 369 : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో పేరు సంపాదించిన  హీరో బాలకృష్ణ ఒక్కరే. ఆయన తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు. బాలనటుడి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాత్రల‌ను పోషించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. జానపదం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం, సైన్స్ ఫిక్షన్, ఫ్యాక్ష‌నిజం ఇలా ఎన్నో వైవిధ్యమైన కథల్లో నటించి హిట్లు కొట్టిన ఘనత బాలయ్యకే దక్కుతుంది.

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అత్యంత భారీ విజయాలు సాధించిన సినిమాల్లో ఆదిత్య 369 సినిమా కూడా ఒకటి. ఈ సినిమా కథ కూడా అప్పటిలో ఒక సంచలనం అనే చెప్పాలి. ఆదిత్య 369 సినిమా తర్వాత బాలయ్య కెరీర్ చాలా స్పీడ్ గా ముందుకు దూసుకుపోయింది. ఈ సినిమా తరువాత సక్సెస్ ఫుల్ దర్శకులు ఎందరో బాలకృష్ణ డేట్స్ కోసం క్యూ కట్టారు.

Aditya 369

అలాంటి ఈ అద్భుతమైన చిత్రంలో సినీ ప్రముఖులకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రమణ్యం ఒకసారి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తో మాట్లాడుతూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గర ఉన్న టైం ట్రావెల్ కథ చెప్పడం, ఆ తర్వాత ఆ సినిమా చేయడానికి నిర్మాత ఒకే చెప్పడం జరిగాయట. ఆ తర్వాత కృష్ణదేవరాయల కాలం అనగానే బాలకృష్ణ గుర్తుకు రావడం, ఆయన వద్దకు వెళ్లి కథ గురించి చర్చలు జరపటం, బాలయ్య కూడా ఒకే చెప్పడంతో సినిమా షూటింగ్ పనులు స్టార్ట్ చేయడం జరిగిందట.

మొదట్లో ఈ సినిమాకి సుమారు 1 కోటి 30 లక్షలు రూపాయలు అవుతుందని దర్శక నిర్మాతలు అంచనా వేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా బడ్జెట్  మరో 30 లక్షలు అదనంగా ఖర్చు చేయడం జరిగింది. ఇక  షూటింగ్ లో వేసిన సెట్లు, వాటికి కలిగిన ఆదరణ చూసి డిస్ట్రిబ్యూటర్లు సైతం ఎక్కువ ఖర్చు చేయడానికి రెడీ గా ముందుకు వచ్చారట. దీనితో సినిమాకు ఒక కోటి 52 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించడం జరిగింది.

మొదట్లో ఈ సినిమాకు యుగపురుషుడు, ఆదిత్యుడు, శ్రీ కృష్ణ దేవరాయలు అనే పేర్లు అనుకోవటం జరిగింది. కానీ చివరికి ఆదిత్య అని పేరు పెట్టి టైం ట్రావెలింగ్ కాబట్టి 369 అనే అంకెలను జత చేయడం జరిగింది. ఇలా ఈ సినిమా జూలై 18, 1991 న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం ట్రావెల్ అనే కొత్త కథాంశం కావడంతో అప్పటిలో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అదేవిధంగా ఈ సినిమాకు ముందుగా హీరోయిన్ గా విజయశాంతిని అనుకోవడం జరిగిందట. కానీ ఆమె అప్పటికే వేరే చిత్రాలతో  బిజీ ఉండటంతో మోహిని హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM