జీవితంలో ప్రతి వ్యక్తి సొంత ఇంటిని నిర్మించుకోవాలని కలలు కంటుంటాడు. అందుకోసమే ఎవరైనా సరే కష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే సొంతింటి కలను నిజం చేసుకుంటుంటారు. అయితే ఇల్లు కట్టుకోవడం అంటే మాటలు కాదు. ముఖ్యంగా వాస్తును తప్పనిసరిగా పాటించాలి. లేదంటే దోషాలు ఏర్పడి అందులో ఉండే వారికి సమస్యలు వస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకున్నప్పటికీ ఇంటిపై దిష్టి ఉంటే అప్పుడు కూడా సమస్యలు వస్తుంటాయి. అయితే ఇంటికి దిష్టి తగలకుండా ఉండేందుకు గాను చాలా మంది అనేక రకాల పద్ధతులను పాటిస్తుంటారు. వాటిల్లో ప్రధాన ద్వారం వద్ద బూడిద గుమ్మడికాయను వేలాడదీయడం కూడా ఒకటి.
బూడిద గుమ్మడికాయలు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. కొత్త ఇంటికి గృహ ప్రవేశం చేసినప్పుడు లేదా మరే సందర్భంలో అయినా సరే చాలా మంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద బూడిద గుమ్మడికాయను కట్టి వేలాడదీస్తుంటారు. దీంతో నరఘోష, దిష్టి, నర పీడలు వంటివన్నీ పోతాయి. ఇక బూడిద గుమ్మడికాయను సాక్షాత్తూ కాలభైరవ స్వామి స్వరూపంగా చెబుతుంటారు. అందువల్ల బూడిద గుమ్మడికాయను కడితే దిష్టి తగలదని నమ్ముతుంటారు. అయితే బూడిద గుమ్మడికాయను కట్టిన తరువాత కొన్ని రోజులకే కుళ్లిపోతుంది. ఇక ఇందుకు అర్థం ఏమిటంటే.. బూడిద గుమ్మడికాయ త్వరగా కుళ్లిపోతే ఆ ఇంటికి దిష్టి బాగా ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే ఇంకో బూడిద గుమ్మడికాయను కట్టాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.
ఇక బూడిద గుమ్మడికాయను కట్టేటప్పుడు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా గుమ్మడికాయను కట్టాలనుకుంటే ముందు రోజు సాయంత్రమే దానిని తీసుకొచ్చి తరువాతి రోజు సూర్యోదయ సమయంలో ఇంటి ముందు అలంకరించుకోవాలి. గుమ్మడికాయకు పసుపు, కుంకుమ రాసి ఇంటి ముందు వేలాడదీసుకోవాలి. ఈ విధంగా గుమ్మడికాయ కట్టిన తర్వాత ప్రతి రోజు మనం పూజ చేసేటప్పుడు రెండు అగరొత్తులని వెలిగించి ధూపం వేయాలి. ఇలా చేయడం వల్ల ఏ విధమైన చెడు ప్రభావం ఉండదు. అంతేకాదు గుమ్మడికాయని కట్టడం కోసం ప్రత్యేకమైన దినాలు కూడా ఉన్నాయి. బుధవారం, గురువారం లేదా ఆదివారం రోజులలో గుమ్మడికాయని కట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇలా బూడిద గుమ్మడికాయను కట్టుకోవాల్సి ఉంటుంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…