Samantha : సమంత సంపాదించిన డబ్బంతా ఏమైంది ? అక్కినేని కుటుంబమే వాడుకుందా ? పైసా ఇవ్వలేదా ?

October 5, 2021 2:57 PM

Samantha : అక్టోబర్ 2వ తేదీన సమంత, నాగ చైతన్యల వివాహబంధానికి ముగింపు పలుకుతున్నామని నాగచైతన్య, సమంత దంపతులు సోషల్ మీడియా వేదికగా విడాకుల విషయాన్ని ప్రకటించారు. అయితే వీరి విడాకుల గురించి ప్రకటన వెలువడగానే చాలామంది కేవలం సమంతది మాత్రమే తప్పు ఉన్నట్టు, ఆమెకు ఇతర వ్యక్తులతో సంబంధాలు ఉండడం వల్లనే విడిపోయిందని పెద్దఎత్తున రూమర్లు వచ్చాయి.

what happened to samantha money

తాజాగా సమంత విడాకుల విషయంపై నటి మాధవీ లత స్పందించారు. ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ.. పెద్ద కుటుంబానికి పెద్ద మనసు ఉంటుంది అనుకోవడం పొరపాటు. సమంత సినిమాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నప్పటికీ పాకెట్ మనీ కోసం చేతులు చాచేదని.. షాకింగ్ విషయాలను బయటపెట్టారు. అసలు సమంత సంపాదించిన డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది ? ఆమె కోట్లు సంపాదించినా.. ఆ లెక్కలన్నీ తనకు తెలియదు. మరి తన డబ్బులన్నీ ఎక్కడ ? అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు కురిపిస్తూ సమంతలో ఉన్న మరో కోణాన్ని బయటపెట్టారు.

Samantha : డబ్బు మొత్తాన్ని అక్కినేని కుటుంబమే వాడుకున్నారు

మాధవీలత చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే అక్కినేని కుటుంబమే సమంతను ఎన్నో చిత్రహింసలకు గురి చేసిందని, తను సంపాదించిన డబ్బు మొత్తాన్ని అక్కినేని కుటుంబమే వాడుకున్నారు.. అంటూ పరోక్షంగానే వివరాలను బయట పెట్టింది. ఆమె డబ్బు మనిషి కాదని, సినిమాలలో సంపాదించిన డబ్బుతో ఏం చేయాలో కూడా తెలియని అమాయకురాలు అంటూ.. సమంతకు మద్దతుగా నిలబడింది. ప్రస్తుతం మాధవీలత సమంత విషయంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now