Vivo Y21T : మొబైల్స్ తయారీదారు వివో.. వై21టి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. వై సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ ఫోన్ ఇదే కాగా.. ఇందులో అందిస్తున్న ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
వివో వై21టి స్మార్ట్ ఫోన్‌లో 6.58 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది. 4జీబీ ర్యామ్ లభిస్తుంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండగా.. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే ఆప్షన్‌ను ఇచ్చారు.
ఈ ఫోన్‌లో డ్యుయల్ సిమ్‌లు, ఒక మైక్రో ఎస్‌డీ కార్డు కోసం మొత్తం 3 స్లాట్లను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వెనుక వైపు 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతోపాటు 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను అదనంగా ఇచ్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంటుంది. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తోంది.
వివో వై21 టి స్మార్ట్ ఫోన్ పెరల్ వైట్, మిడ్ నైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. ఈ ఫోన్ ధర రూ.16,490గా ఉంది. దీన్ని అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…