Vishnu Manchu : యాంకర్ దేవి నాగవల్లితో గొడవ అయినప్పటి నుంచి విశ్వక్ సేన్‌ను సపోర్ట్ చేస్తున్న టాలీవుడ్ నటుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కొందరు ఆయనకు నేరుగా సపోర్ట్‌ను అందిస్తే.. కొందరు ఆయన సినిమాను అభినందిస్తూ ఇన్‌డైరెక్ట్‌గా సపోర్ట్ ఇస్తున్నారు. నటి కరాటే కల్యాణి, దర్శకులు బండి సరోజ్, హరీష్ శంకర్, హేతువాది బాబు గోగినేని, కమెడియన్ రాహుల్ రామకృష్ణలు నేరుగా మద్దతు ఇచ్చారు.
ఇక మెగా హీరో సాయిధరమ్ తేజ్, డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డలు విశ్వక్ సేన్ సినిమా.. అశోకవనంలో అర్జున కల్యాణం చూశామని.. చాలా బాగుందని.. విశ్వక్ అద్భుతంగా నటించాడని.. కొనియాడుతూ ట్వీట్లు చేశారు. అయితే తాజాగా మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు కూడా ఇన్‌డైరెక్ట్ గా విశ్వక్ కు సపోర్ట్ ఇచ్చారు.
విశ్వక్ సేన్‌ను తమ్ముడిగా అభివర్ణించిన విష్ణు.. ఆయన నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు విష్ణు ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే విశ్వక్‌కు డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా టాలీవుడ్ నటులు సపోర్ట్‌ను అందిస్తున్నారు. మరోవైపు నెటిజన్లు సైతం విశ్వక్‌కే అండగా నిలిచారు.
ఇక విశ్వక్ నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్విట్టర్ రివ్యూ ప్రకారం.. సినిమా బాగుందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో విశ్వక్‌కు జంటగా రుక్సార్ థిల్లాన్ నటించగా.. విద్యాసాగర్ చింతా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…