Viral Video : నిప్పుతో విన్యాసం చేయ‌బోయాడు.. గ‌డ్డం త‌గ‌ల‌బ‌డింది.. వైర‌ల్ వీడియో..

October 31, 2022 6:57 PM

Viral Video : ప్ర‌స్తుత త‌రుణంలో సామాజిక మాధ్య‌మాల్లో అనేక వీడియోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వాటిల్లో మ‌న‌ల్ని కొన్ని ఆక‌ర్షిస్తుంటాయి. ఇప్పుడు కూడా అలాంటిదే ఒక వీడియో వైర‌ల్ అవుతోంది. అందులో ఒక వ్య‌క్తి గ‌డ్డం త‌గ‌ల‌బ‌డ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. సోష‌ల్ మీడియాలో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. దీన్ని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు. అయితే ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందో చూద్దాం.

ఏదో కార్య‌క్ర‌మంలో ఓ యువ‌కుడు స్టేజిపై నిల‌బ‌డి నిప్పుతో స్టంట్ చేయ‌బోయాడు. అందులో భాగంగానే అత‌ను నోట్లోకి పెట్రోల్ తీసుకుని మంట‌ను ఊదాడు. అయితే మంట ముందుకు వెళ్లింది. కానీ అత‌ని గ‌డ్డంపై పెట్రోల్ ప‌డింది కాబోలు.. అక్క‌డ కూడా మంట‌లు అంటుకున్నాయి. వెంట‌నే చుట్టూ ఉన్న‌వారు అప్ర‌మ‌త్త‌మైన అంటుకున్న గ‌డ్డాన్ని ఆర్పేశారు. చూస్తుంటే త‌క్కువ న‌ష్టంతోనే ఆ వ్య‌క్తి బ‌య‌ట ప‌డ్డాడు. అయితే ఆ త‌రువాత ఏం జ‌రిగింది.. అస‌లు ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జరిగింది.. అన్న వివ‌రాలు మాత్రం తెలియ‌రాలేదు. కానీ సామాజిక మాధ్య‌మాల్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Viral Video youth tried to perform with fire but burnt beard
Viral Video

ఇక ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు చాలా ర‌కాలుగా స్పందిస్తున్నారు. కాస్త ఉంటే తీవ్ర న‌ష్టం జ‌రిగి ఉండేది.. భూమి మీద ఇంకా నూక‌లు ఉన్నాయి కాబ‌ట్టే అత‌ను బ‌తికిపోయాడు.. అస‌లు ఇలా చేయ‌డం అవ‌స‌ర‌మా.. నిప్పుతో స్టంట్స్ చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండొద్దా.. అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ravi Patidar (@ravipatidar603)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now