Viral Video : డ్రైవ‌ర్‌కు ఫిట్స్ వ‌స్తే.. ఆ మ‌హిళ స్టీరింగ్ అందుకుని బ‌స్సును న‌డిపించింది..

January 17, 2022 2:42 PM

Viral Video : ప్ర‌మాదాలు సంభ‌వించే స‌మ‌యంలో చాక‌చ‌క్యంగా, స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించాలి. దీంతో ఆ ప్ర‌మాదాల నుంచి ఎలాంటి న‌ష్టం లేకుండా బ‌యట ప‌డేందుకు వీలుంటుంది. అవును.. ఆ మ‌హిళ కూడా స‌రిగ్గా ఇలాగే చేసింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

Viral Video woman driven bus after driver gets seizures

మ‌హారాష్ట్ర‌లోని పూణె స‌మీపంలో ఉన్న షిరూర్ అనే ఆగ్రో టూరిజం సెంట‌ర్ నుంచి ఓ మినీ బ‌స్సు వ‌స్తోంది. అయితే మార్గ మ‌ధ్య‌లో ఆ బ‌స్సు డ్రైవ‌ర్‌కు ఫిట్స్ వ‌చ్చాయి. దీంతో అత‌ను బ‌స్సును అడ్డ దిడ్డంగా పోనివ్వ‌సాగాడు. ఈ క్ర‌మంలో బ‌స్సులో ఉన్న మ‌హిళ‌లు, పిల్ల‌లు తీవ్రంగా భ‌య‌ప‌డ్డారు. అయితే అప్పుడే 42 ఏళ్ల యోగితా స‌త‌వ్ అనే మ‌హిళ చాకచ‌క్యంగా వ్య‌వ‌హ‌రించింది.

స‌ద‌రు డ్రైవ‌ర్‌ను సీట్ నుంచి తీసి ప‌క్క‌న ప‌డుకోబెట్టి వెంట‌నే స్టీరింగ్ అందుకుంది. త‌న‌కు కార్ న‌డిపిన అనుభ‌వం ఉంది. దీంతో ఏమాత్రం ఆందోళ‌న చెంద‌కుండా ఆ మినీ బ‌స్సును ప‌రుగెత్తించింది. అలా ఆమె ఆ బ‌స్సును సుమారుగా 10 కిలోమీట‌ర్ల దూరం న‌డుపుతూ వ‌చ్చి ఆ డ్రైవ‌ర్‌ను హాస్పిట‌ల్‌లో చేర్పించింది. అనంత‌రం ఆ బ‌స్సులో ఉన్న‌వారి త‌మ త‌మ ఇళ్ల వ‌ద్ద దింపేసింది.

కాగా ఆ మహిళ బ‌స్సు న‌డుపుతున్న వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. అది వైర‌ల్ గా మారింది. అంద‌రూ ఆమె ధైర్యానికి, స‌మ‌య‌స్ఫూర్తికి మెచ్చుకుంటున్నారు. ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడింద‌ని ఆమెను నెటిజ‌న్లు అభినందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now