Viral Video : విమానంలో అదిరిపోయేలా డ్యాన్స్ చేసిన ఎయిర్ హోస్టెస్‌.. వీడియో..!

May 7, 2022 7:56 PM

Viral Video : ప్ర‌స్తుత త‌రుణంలో సోష‌ల్ మీడియా అందుబాటులో ఉండ‌డంతో చాలా మంది అందులో వీడియోల‌ను పోస్ట్ చేస్తున్నారు. ప‌లు పాట‌ల‌కు స్టెప్పులు వేస్తూ అల‌రిస్తున్నారు. త‌మ డ్యాన్స్ ల‌కు చెందిన వీడియోల‌ను పోస్ట్ చేస్తూ ఫాలోవ‌ర్ల సంఖ్య‌ను పెంచుకుంటున్నారు. గ‌తంలో టిక్‌టాక్ యాప్ ఉన్న‌ప్పుడు ఎలాగైతే చాలా మంది వీడియోల‌ను పోస్ట్ చేసేవారో.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అలాగే వీడియోల‌ను పోస్ట్ చేస్తున్నారు. నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తున్నారు. ఇక లేటెస్ట్‌గా ఓ ఫ్లైట్ అటెండెంట్ కూడా అలాగే ఓ పాట‌కు డ్యాన్స్ చేసి ఆ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైర‌ల్‌గా మారింది.

స్పైస్ జెట్ అనే విమాన‌యాన సంస్థ‌కు చెందిన ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి తాజాగా మై సే మినా సే నా స‌ఖి సే.. అనే హిందీ పాట‌కు డ్యాన్స్ చేసింది. స్పైస్ జెట్‌కు చెందిన ఖాళీగా ఉన్న విమానంలో ఆమె ఈ పాట‌కు డ్యాన్స్ చేసింది. ఆ పాట 1987లో విడుద‌లైన న‌టుడు గోవిందా న‌టించిన ఖుద్‌గ‌ర్జ్ చిత్రంలోనిది. ఆ పాట‌కే ఆమె అదిరిపోయేలా స్టెప్పులు వేసింది. అనంత‌రం ఆ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయ‌గా.. ఆ వీడియో వైర‌ల్ అవుతోంది.

Viral Video Spice Jet air hostess dance to Bollywood song
Viral Video

కాగా ఉమా మీనాక్షి షేర్ చేసిన వీడియోకు ఇప్ప‌టికే 9 లక్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. 65వేల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి. చాలా మంది ఆమె డ్యాన్స్‌ను మెచ్చుకుంటున్నారు. ఇక ఆమె ఇలా చేయ‌డం కొత్తేమీ కాదు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ అల‌రిస్తుంటుంది. అలా ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 8.71 ల‌క్ష‌ల‌కు పైగా ఫాలోవ‌ర్లు ఏర్ప‌డ్డారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.

 

View this post on Instagram

 

A post shared by UMA MEENAKSHI (@yamtha.uma)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now