Viral Video : మన చుట్టూ పరిసరాల్లో నిత్యం అనేక సంఘటనలు జరుగుతుంటాయి. అన్ని సంఘటనలకు అంతటి ప్రాముఖ్యత ఉండదు. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మనల్ని విపరీతంగా ఆకర్షిస్తాయి. ముఖ్యంగా మన చుట్టూ ప్రకృతిలో జీవించే కొన్ని రకాల జీవులు చేసే పనులకు మనకు నవ్వు వస్తుంటుంది. అవి మనల్ని వాటి చేష్టలతో ఆకట్టుకుంటుంటాయి. అలాంటి జీవుల్లో కోతులు ఒకటి అని చెప్పవచ్చు. ఇవి చేసే అల్లరి పనులు అందరికీ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇక తాజాగా ఇలాగే ఓ కోతి కూడా తన వింతైన చేష్టలతో అందరికీ నవ్వు తెప్పిస్తోంది.
ఒక కోతి రోడ్డుపై అచ్చం మనుషులు రెండు కాళ్లతో నడిచినట్లుగానే నడుస్తూ దర్జాగా వెళ్లింది. అనంతరం బ్రిడ్జిపైకి జంప్ చేసి అక్కడ పోల్స్ మీద చాలా దూరం నుంచి అనేక సార్లు మళ్లీ జంప్ చేస్తూ వెళ్లింది. చూస్తే ఎంతో నవ్వు తెప్పించేలా ఉన్న ఈ సంఘటనను కొందరు కెమెరాల్లో బంధించి వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఈ వీడియోకు 10.4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 47వేలకు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం మనుషుల్లాగే ఈ కోతి ప్రవర్తించిందని కొందరు అంటే.. చాలా అద్భుతంగా జంప్‌లు చేసిందని.. ఇంకొందరు ఈ కోతికి కితాబిస్తున్నారు. ఇక ఈ వీడియోను చాలా మంది ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…