Manchu Vishnu : మంచు ఫ్యామిలీకి ఈ మధ్య ఏం చేసినా కలసి రావడం లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికవడం ఒక్కటే.. వారికి కలసి వచ్చిన అంశం. ఆ తరువాత నుంచి వారి ఫ్యామిలీ తెగ విమర్శలకు గురవుతోంది. అప్పట్లో కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం చెందడంతో ఆయన మృతిని ఇంకా ధ్రువీకరించకముందే మంచు లక్ష్మి ట్వీట్ చేసి అడ్డంగా బుక్కయింది. దీంతో నెటిజన్లు ఆమెను ఒక ఆట ఆడుకున్నారు.
ఇక తరువాత టాలీవుడ్ సమస్యలను పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి తీవ్రమైన కృషి చేశారు. కానీ మా అధ్యక్షుడి హోదాలో ఉండి కూడా మంచు విష్ణు అసలు అందుకు చిన్న పని కూడా చేయలేదు. దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్ మరోమారు మంచు ఫ్యామిలీపై విమర్శలు చేశారు. తరువాత మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఈ సినిమా పట్ల నెటిజన్ల ట్రోల్స్, విమర్శలు మరీ ఎక్కువయ్యాయి. ఆ తరువాత మంచు విష్ణు తన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్‌పై లేని పోని ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. ఇది కూడా మంచు ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ తెచ్చి పెట్టింది. దీంతో మంచు ఫ్యామిలీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో ట్రోల్స్‌ను, విమర్శలను ఎదుర్కొంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో మంచు విష్ణు, లక్ష్మి, మోహన్ బాబులపై జోకులు పేలుతూనే ఉన్నాయి.
ఇక తాజాగా మంచు విష్ణు మరోమారు ట్రోలర్స్ బారిన పడ్డారు. అందుకు ఆయన చేసిన ట్వీటే కారణమని చెప్పవచ్చు. అప్పట్లో ఆయన శ్రీను వైట్లతో చేసిన ఢీ సినిమా బంపర్ హిట్ అయింది. అందులో జెనీలియా, శ్రీహరి నటించారు. అయితే ఆ మూవీ వచ్చి 15 ఏళ్లు పూర్తయిందని చెబుతూ విష్ణు ట్వీట్ చేశారు. దీంతో ట్రోలర్స్‌కు మళ్లీ పని కల్పించినట్లు అయింది. ఈ క్రమంలోనే వారు విష్ణును పెద్ద ఎత్తున మరోమారు విమర్శిస్తున్నారు.
అన్నా.. మీరు ఇంకా ఢీ మూవీ ధ్యాసలోనే ఉన్నారు, బయటకు రండి.. అని ఒక ట్రోలర్ కామెంట్ చేయగా.. మీరు ఈ మధ్య యాక్షన్‌కు బదులుగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.. తగ్గించుకుంటే మంచిదని.. ఇంకో నెటిజన్ విమర్శించాడు. అలాగే మీరు యాక్షన్ మూవీలపై దృష్టి పెట్టండి, కామెడీ మూవీలు కాదు.. అని ఇంకో నెటిజన్ రిప్లై ఇచ్చాడు. ఇలా చాలా మంది మంచు విష్ణు ట్వీట్‌పై కామెంట్స్ పెడుతున్నారు. అయితే మా అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు తాను చెప్పిన ప్రకారం మా బిల్డింగ్ కడతాడా.. లేదా.. అని ఇంకొందరు కూడా ప్రశ్నించారు. కానీ అందుకు విష్ణు సమాధానం అయితే చెప్పలేదు.
ఇక ప్రస్తుతం విష్ణు ఓ కామెడీ మూవీ చేస్తున్నారు. అందులో ఆయన పాత్ర పేరును ఇటీవలే రివీల్ చేశారు. గాలి నాగేశ్వర్ రావుగా ఆయన కనిపించనున్నారు. విష్ణుకు జోడీగా పాయల్ రాజ్‌పూత్ నటిస్తుండగా.. సన్నీ లియోన్ ఇంకో కీలకపాత్రలో కనిపించనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…