Viral Video : మనం ఈ జన్మలో చేసిన పాపాలకు వచ్చే జన్మలో శిక్షను అనుభవిస్తామని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఈ జన్మ కర్మ ఫలాన్ని వచ్చే జన్మలో అనుభవిస్తామని చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం ఈ జన్మ కర్మ ఫలాన్ని ఈ జన్మలోనే.. ఇంకా చెప్పాలంటే.. అప్పటికప్పుడే దాన్ని అనుభవిస్తారు. అప్పుడు చేసిన తప్పులకు అప్పుడే.. వెంటనే కర్మఫలాన్ని అనుభవిస్తారు. అవును.. వారికి కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఒక దున్నపోతును చిన్నపాటి బండికి కట్టేసి దాని మీద కొందరు కూర్చుని రోడ్డుపై వేగంగా వెళ్లడం మొదలు పెట్టారు. వారు నెమ్మదిగా వెళదాం అని అనుకోలేదు. దున్నపోతును చిత్ర హింసలకు గురి చేశారు. కర్రతో కొడుతూ దాన్ని వేగంగా వెళ్లేలా చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన దున్నపోతు డివైడర్‌కు మీదుగా రోడ్డుకు అవతలి వైపుకు వెళ్లింది. దీంతో డివైడర్‌ను ఢీకొట్టిన ఆ బండి వెంటనే బోల్తా పడింది. అందులో కూర్చున్న వారందరూ దూరంగా విసిరేసినట్లు ఎగిరిపడ్డారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దీనికి సంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అందరూ ఆ దున్నపోతుకే మద్దతు పలుకుతున్నారు. బాగా అయింది వెధవలకి.. జంతువులను ఇలా హింసించే వారికి ఇలాగే జరగాలి.. కర్మ ఫలం అంటే ఇదే.. అంటూ చాలా మంది రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…
ఇటీవలి కాలంలో చాలా వరకు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇతర నటీనటులకు చెందిన ఫొటోలు,…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీలను అసలు అమలు చేయలేదని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా సరే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ…
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం తనను నిరాశకు గురి…
పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవలే రిలీజ్ చేసిన విషయం…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళనాడు వాసి అయినప్పటికీ పలు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ఆమె…