Viral Video : సింహంతోనే ఆటలా.. వేళ్లను నోట్లో పెట్టాడు.. కొరికి పారేసింది..!

June 12, 2022 10:55 PM

Viral Video : సాధార‌ణంగా మ‌నం ఇంట్లో పెంచుకునే కుక్క‌, పిల్లి వంటి వాటి విష‌యంలోనే జాగ్ర‌త్త‌గా ఉండాలి. అవి పెంపుడు జంతువులే కావ‌చ్చు.. కానీ క్రూర మృగాల జాబితాకు చెందుతాయి. క‌నుక వాటితో జాగ్ర‌త్త‌గానే ఉండాలి. అయితే వీటితోనే ఇంత జాగ్ర‌త్త ఉండాల‌న‌ప్పుడు సింహం మ‌న ఎదురుగా ఉంటే ఇంకా ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి చెప్పండి. మ‌నం మ‌న శ‌రీరాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. లేదంటే అన‌ర్థాలు సంభ‌విస్తాయి. స‌రిగ్గా ఓ వ్య‌క్తికి కూడా ఇలాగే జ‌రిగింది. సింహం ముందు కుప్పి గంతులు వేశాడు. ఏకంగా వేలినే పోగొట్టుకున్నాడు. ఇంత‌కీ అస‌లు ఏం జరిగిందంటే..

జ‌మైకాలోని సెయింట్ ఎలిజ‌బెత్‌లో ఉన్న ఓ జూలో అక్క‌డి సిబ్బంది ఒక్క వ్య‌క్తి సింహంతో ఆట‌లాడాడు. ఆ.. న‌న్ను అది ఏం చేస్తుందిలే అని లైట్ తీసుకున్నాడు. దీంతో అత‌ను త‌న చేతి వేళ్ల‌ను దాని నోట్లో పెట్టి ఆడ‌సాగాడు. అయితే అది అత‌ని వేళ్ల‌లో ఒక వేలిని నోట క‌రుచుకుంది. వెంట‌నే కొరికి మింగేసింది. దీంతో ఆ వ్య‌క్తి ల‌బోదిబోమ‌న్నాడు. అయితే అది బోనులో ఉంది కాబ‌ట్టి స‌రిపోయింది. లేదంటే ఇంకా పెద్ద అన‌ర్థ‌మే జ‌రిగి ఉండేది.

Viral Video man played with lion what happened next
Viral Video

ఇక ఈ సంఘ‌ట‌నను అక్క‌డే ఉన్న కొంద‌రు సంద‌ర్శ‌కులు చిత్రీక‌రించి పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే ఆ వ్య‌క్తిని అంద‌రూ విమర్శిస్తున్నారు. సింహంతో ప‌రాచికాలు ఆడితే ఇలాగే జ‌రుగుతంద‌ని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now