Viral Video : ప్రాణాల‌కు తెగించి మ‌రీ కుక్క ప్రాణాల‌ను కాపాడిన హోమ్ గార్డు.. హ్యాట్సాఫ్‌..!

January 28, 2022 1:07 PM

Viral Video : స‌మాజంలో ఉన్న జీవాలు అన్నీ ఒక్క‌టే. గేదె అయినా ఆవు అయినా.. ఆఖ‌రికి కుక్క అయినా.. ఏ జీవి అయినా దేవుడి సృష్టిలో ఒక్క‌టే. అన్నింటిదీ ఒకే ప్రాణం. అవును స‌రిగ్గా ఇలా భావించాడు క‌నుక‌నే ఆయ‌న త‌న ప్రాణాలు పోతాయ‌ని తెలిసినా.. తెగించి మ‌రీ.. ధైర్య సాహ‌సాల‌తో వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోతున్న ఓ కుక్క‌ను ర‌క్షించాడు. అంద‌రిచే ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. వివ‌రాల్లోకి వెళితే..

Viral Video home guard saved dogs life in flood stream

తెలంగాణ రాష్ట్రంలోని నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో పోలీసు డిపార్ట్‌మెంట్‌లో హోమ్ గార్డుగా విధులు నిర్వ‌ర్తిస్తున్న ముజీబ్ ఉర్ ర‌హ‌మాన్ స్థానికంగా ఓ న‌దిలో వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోతున్న కుక్క‌ను చూశాడు. వెంట‌నే స్థానికుల‌కు స‌మాచారం అందించి జేసీబీని తెప్పించాడు.

జేసీబీని వ‌ర‌ద నీటిలోకి ర‌ప్పించి అక్క‌డ తాను నిలుచుని నెమ్మ‌దిగా కుక్క‌ను నీటి నుంచి బ‌య‌ట‌కు తీశాడు. అనంత‌రం జేసీబీ స‌హాయంతో కుక్క‌ను వాగు నుంచి బ‌య‌ట‌కు తీశాడు. త‌రువాత దాన్ని గ్రామంలో వ‌దిలేశాడు. ఆ స‌మ‌యంలో వాగు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. తేడా వ‌స్తే ర‌హ‌మాన్ కూడా కొట్టుకుపోయి ఉండేవాడే. కానీ అత్యంత చాక‌చ‌క్యంగా ఆయ‌న ఆ కుక్క‌ను వ‌ర‌ద నీటి నుంచి ర‌క్షించాడు.

ఈ క్ర‌మంలో ర‌హ‌మాన్ అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటున్నాడు. ప్రాణాల‌కు తెగించి మ‌రీ ఆ శున‌కాన్ని ర‌క్షించినందుకు అంద‌రూ ఆయ‌న‌ను అభినందిస్తున్నారు. కాగా ఈ వీడియోను ఐపీఎస్ ఆఫీస‌ర్ దీపాన్షు కాబ్రా ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now