Viral Video : సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్న తండ్రి.. ఆనందం ప‌ట్ట‌లేని కొడుకు.. అంద‌రినీ క‌దిలిస్తున్న వీడియో..!

May 21, 2022 9:34 PM

Viral Video : మ‌న చుట్టూ స‌మాజంలో అనేక సంఘ‌ట‌న‌లు నిత్యం జ‌రుగుతుంటాయి. అయితే వాటిలో మ‌నం తెలుసుకునే సంఘ‌ట‌న‌లు చాలా కొన్నే ఉంటాయి. కానీ కొన్ని సంఘ‌ట‌న‌లు మాత్రం మ‌న‌కు క‌ళ్ల‌బ‌డిన‌ప్పుడు అవి మ‌న‌ల్ని క‌దిలించేస్తుంటాయి. అవును.. ఇప్పుడు కూడా అలాగే జ‌రిగింది. ఎక్క‌డ తీశారో తెలియ‌దు కానీ.. ఓ తండ్రి తెచ్చిన సెకండ్ హ్యాండ్ సైకిల్‌ను చూసి ఓ కొడుకు ఆనందం ప‌ట్ట‌లేక‌పోయాడు. ఈ క్ర‌మంలోనే వారి వీడియో అంద‌రినీ క‌దిలిస్తోంది.

ఒక తండ్రి క‌ష్ట‌ప‌డి సెకండ్ హ్యాండ్ సైకిల్‌ను ఇంటికి తెచ్చాడు. అనంత‌రం దానికి పూల‌మాల వేసి పూజ చేశాడు. చివ‌ర‌కు దానికి న‌మ‌స్కారం పెట్టాడు. అయితే సైకిల్ తెచ్చిన‌ప్ప‌టి నుంచి అతని కొడుకు దాని చుట్టే తిరుగుతూ ఎంతో సంతోషంగా ఉన్నాడు. అత‌ను ఆ ఆనందాన్ని ప‌ట్ట‌లేక‌పోయాడు. ఈ క్ర‌మంలోనే చివ‌ర‌కు త‌న కొడుకును ఆ తండ్రి హ‌త్తుకున్నాడు. కాగా ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌దు కానీ.. చాలా మందిని ఈ వీడియో క‌దిలించేస్తోంది. దీన్ని చాలా మంది చూసి కంట‌త‌డి పెడుతున్నారు.

Viral Video father bought second hand bicycle son happy
Viral Video

ఇక ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవ‌నీష్ శ‌ర‌న్ షేర్ చేయ‌గా.. దీనికి ఇప్ప‌టికే 5 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. ఎంతో మంది ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేస్తున్నారు. అనేక కామెంట్లు కూడా పెడుతున్నారు. చిన్న‌పాటి సంతోషం అంటే ఇదే.. వారు ప‌డుతున్న ఆనందాన్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం.. అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now