Viral Video : ఉత్త‌రాఖండ్‌లో వ‌ర‌ద భీభ‌త్సం.. వ‌ర‌ద‌లో చిక్కుకున్న ఏనుగును ర‌క్షించారు..

October 20, 2021 9:51 AM

Viral Video : ఉత్త‌రాఖండ్‌ను భారీ వ‌ర్షాలు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. ప‌లు చోట్ల బ్రిడ్జిలు, ర‌హ‌దారులు తీవ్రంగా దెబ్బ తిన‌డంతో ర‌వాణా వ్య‌వస్థ‌కు తీవ్ర ఆటంకం క‌లుగుతోంది. కాగా ఉత్త‌రాఖండ్ లోని గౌలా న‌దిలో చిక్కుకుపోయిన ఓ ఏనుగును అక్క‌డి అట‌వీ శాఖ అధికారులు ర‌క్షించారు. ఆ న‌దిలో ఉన్న చిన్న దీవి లాంటి భూభాగంపై ఏనుగు అటు ఇటు తిరుగుతూ ఉండ‌గా.. దాన్ని గ‌మ‌నించిన స్థానికులు అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. దీంతో వారు రంగంలోకి దిగి ఏనుగును ర‌క్షించారు.

Viral Video elephant stuck in floods rescued by forest officials

ఏనుగును ర‌క్షించిన అనంత‌రం దాన్ని అడ‌విలో విడిచి పెట్టామ‌ని, దాని క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నిస్తున్నామ‌ని.. డివిజ‌న‌ల్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ (డీఎఫ్‌వో) సందీప్ కుమార్ తెలిపారు. కాగా ఏనుగు వ‌ర‌ద‌లో చిక్కుకుపోయిన దృశ్యాల‌ను కొంద‌రు త‌మ ఫోన్లలో బంధించారు. ఆ వీడియో వైర‌ల్‌గా మారింది.

https://twitter.com/realabhipandey1/status/1450394764042391553

భారీ వ‌ర్షాల కార‌ణంగా ఉత్త‌రాఖండ్‌లో ప‌లు న‌దులు ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ప్ర‌వ‌హిస్తున్నాయి. దీంతో ప్ర‌జ‌ల్ని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. మ‌రోవైపు వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయిన వారి కోసం స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశారు.

ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాల కార‌ణంగా గౌలా న‌దిపై హ‌ల్‌ద్వానీ వ‌ద్ద ఉన్న బ్రిడ్జి పాక్షికంగా ధ్వంస‌మైంది. అలాగే చంపావ‌త్‌లోని చాల్తి న‌దిపై నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ వ‌ర‌ద‌ల కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య‌ 16కు చేరుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now