Viral Video : ఊ అంటావా పాట‌కు పెళ్లిలో వ‌ధూవ‌రుల స్టెప్పులు.. వైర‌ల్ వీడియో..!

February 9, 2022 4:05 PM

Viral Video : అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా న‌టించిన పుష్ప మూవీ ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. అందులోని పాట‌ల‌న్నీ ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చాయి. ముఖ్యంగా స‌మంత న‌టించిన ఊ అంటావా మావా.. ఐట‌మ్ సాంగ్ అయితే ఇప్ప‌టికీ జ‌నాల నోళ్ల‌లో నానుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుద‌ల కావ‌డంతో అటు హిందీ ప్రేక్ష‌కులు కూడా ఈ సాంగ్‌కు బాగానే క‌నెక్ట్ అయ్యారు. దీంతో వారు ఈ పాట‌కు స్టెప్పులు వేసి అల‌రిస్తున్నారు.

Viral Video bride and groom dance for oo antava song from pushpa movie
Viral Video

తాజాగా మ‌హారాష్ట్ర‌లో ఓ చోట ఓ వివాహ వేడుక‌లో వ‌ధువు, వ‌రుడు ఇద్ద‌రూ ఊ అంటావా.. అనే పాట‌కు స్టెప్పులు వేశారు. ఈ క్ర‌మంలోనే ఆ స‌మ‌యంలో వీడియో తీసి దాన్ని పోస్ట్ చేయ‌గా.. అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Chemistry Studios (@chemistrystudios)

పుష్ప సినిమాలో కేవ‌లం ఆ ఐట‌మ్ సాంగ్ ను చేయ‌డం ద్వారానే స‌మంత‌కు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. దీంతో ఆమెకు ప‌లు ఐట‌మ్ సాంగ్స్ ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. ఇక పైన తెలిపిన వీడియోకు గాను ఇప్ప‌టికే 3 ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్ రాగా.. ఆ వ‌ధూవ‌రులిద్ద‌రూ చేసిన డ్యాన్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now